Thursday, August 15, 2019

డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలా? ఐఎంపీఎస్ వాడుకోండి ఇలా



Read also:

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉందా? తరచూ లావాదేవీలు జరుపుతుంటారా? ఎవరికైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్-IMPS ద్వారా చాలా సులువు. ఇటీవలే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్లో ఐఎంపీఎస్ ఛార్జీలను తొలగించింది ఎస్ బీఐ. బ్రాంచ్ లో కూడా రూ. 1,000 వరకు ఐఎంపీఎస్ ఛార్జీలు లేవు. ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు చాలా వేగంగా ట్రాన్స్ఫర్ అవుతాయి. స్మార్ట్ ఫోన్ నుంచి కూడా ఈజీగా డబ్బులు పంపొచ్చు. ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే IFSC లేదా MMID ఉండాలి.
SBI IMPS: డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలా? ఐఎంపీఎస్ వాడుకోండి ఇలా
SBI IMPS: ఎస్ బీఐ ఐఎంపీఎస్ ద్వారా డబ్బులు పంపండి ఇలా
ముందుగా మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తో ఎస్ బీఐలో లాగిన్ కావాలి. 
తర్వాత పేమెంట్స్ ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేయాలి. 
ఆ తర్వాత IMPS Funds Transfer పైన క్లిక్ చేసి Fund Transfer ఓపెన్ చేయాలి.
పర్సన్ టూ పర్సన్ మనీ ట్రాన్స్ఫర్ కోసం MMID ఉపయోగించాలి. పర్సన్ టూ అకౌంట్ అయితే IFSC కోడ్ ఉపయోగించాలి. బెనీషియరీ పేరు, అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ సీ కోడ్ లాంటివి ఎంటర్ చేయాలి.
ఎంత డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలో ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. చివరగా Confirm పైన క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :