Thursday, August 22, 2019

Scholoship for poor people from NMMS



Read also:

ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు పై చదువుల నిమిత్తం ఆర్థికంగా కేంద్రప్రభుత్వం స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. కేంద్రప్రభుత్వం గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా విద్యార్థులకు ఎన్‌ఎంఎం నేషనల్‌ మెన్స్‌కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పథకం ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులు అర్హులు. ఏటా జరిగే ఈ పరీక్షకు ఈసారి నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈనెల 29 వరకు ఆన్‌లైన్లో విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఎన్నిక అయిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్‌ పూర్తి అయ్యే వరకు నాలుగేండ్ల పాటు ఈ స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.
AP_NMMS
అప్లై చేయండి ఇలా.?
  • 8వ తరగతి విద్యార్థులు ఎన్‌ఎంఎం స్కాలర్‌షిప్‌ పథకానికి మీసేవా ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుదారులకు, పల్లెటూరు విద్యార్థులకు రూ.1,50,000ల ఆదాయం, పట్టణవాసులు అయితే రూ.2లక్షలలోపు ఉండి తాజాగా 7వ తరగతిలో 50శాతం మార్కులతో పాసైన విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు.
  • విద్యార్థులకు ఫీజు ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగుల విద్యార్థులకు రూ.50లు, బీసీ, జనరల్‌ విద్యార్థులకు రూ.100లు చెల్లింపు ఉంటుంది.
  • అప్లికేషన్‌ చేసుకునే విద్యార్థులు రెండు పాస్‌ఫోటోలతో పాటు కుల,ఆదాయ ధృవీకరణ పత్రాలు, బోనాఫైడ్‌, బ్యాంక్‌ ఖాతా, జతచేసి, బ్యాంకులో డీడీ తీసి అప్లికేషన్‌ ఫామ్‌ సర్టిఫికేట్‌తో పాటు డీఈవో ఆఫీసులో లేదా ఆన్‌లైన్లో కాని దరఖాస్తు చేసుకోవచ్చు.
  • నవంబర్‌ 2019,3వ తేదిన ఎన్నిక అయిన విద్యార్థులకు ఉదయం 9:30గంటల నుండి 12:30గంటల వరకు పరీక్ష జరుగుతుంది.
  • రెండు పేపర్లలోని 90మార్కులు స్టాటిస్టిక్స్‌, హెచ్‌ఇన్‌మిన్ట్స్‌లో ఉంటాయి. ఇంగ్లీష్‌, ఉర్దూ, హిందీ, తెలుగు మీడియాల్లో పరీక్షలు ఉంటాయి.
సమయం ఇలా?
  • పరీక్ష సమయం 3 గంటలు. విద్యార్థులు దివ్యాంగులైతే మరో 30 నిమిషాలు ఎక్కువ సమయం కేటాయిస్తారు. 6,7,8, తరగతుల గణితం, సైన్స్‌, సాంఘికశాస్త్రంకు సంబంధించిన విద్యార్థులు పట్టుసాధించాలి.
  • 35 మార్కుల చొప్పున విద్యార్థులు సబ్జెక్టు పరంగా మార్కులు సాధించవల్సి ఉంటుంది.
ఎంపిక చేసే విధానం
  • జిల్లా ప్రాతిపదికన మెరిట్‌లిస్టు అధికారులు ప్రతి పేపరులో మినిమమ్‌ అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరి విద్యార్థులకు 40శాతం, ఎస్సీ,ఎస్టీ విద్యార్థులకు అయితే 32శాతం మార్కులు సాధించాలి. ఎంపిక అయిన విద్యార్థులకు 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్‌ వరకు నెలకు రూ.1000ల చొప్పున సంవత్సరానికి రూ.12వేల స్కాలర్‌షిప్‌ కేంద్రప్రభుత్వం అందిస్తుంది.
  • సద్వినియోగం చేసుకోవాలి..అ మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఆలూరి నరేందర్‌ విద్యార్థులు కేంద్రప్రభుత్వం అందిస్తున్న ఎన్‌ఎంఎం స్కాలర్‌షిప్‌ను సద్వినియోగం చేసుకోవాలి. 
  • 7వ తరగతి ఉత్తీర్ణులై 8వ తరగతిలో ప్రవేశించిన విద్యార్థులు అర్హులు. విద్యార్థులు తమకు సంబంధించిన సర్టిఫికేట్లను మీసేవా ఆన్‌లైన్లో నేరుగా డీఈవో ఆఫీసులో దరఖాస్తు చేసిన ఫారా లను అందించి ఈ స్కాలర్‌షిప్‌ను సద్వినియోగం చేసు కోవచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :