Thursday, August 22, 2019

విద్యార్థులకు గుడ్ న్యూస్ : సెప్టెంబర్ 1 నుంచి కొత్త బస్ పాస్ లు



Read also:

గ్రామీణ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వారికి కొత్త బస్ పాస్ లు ఇవ్వనుంది. ఈ పాస్ లతో ఇకపై 50 కిమీ వరకు జర్నీ చేయొచ్చు. బస్ పాస్ ల చార్జీలను ఏపీఎస్ ఆర్టీసీ ఖరారు చేసింది. సెప్టెంబర్ 1 నుంచి బస్ పాస్ లు అందుబాటులోకి వస్తాయి. అన్ని రంగాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందించేందుకు సీఎం జగన్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా విద్యార్థులకు శుభవార్త అందించింది. ఆర్ధిక భారం పడకుండా చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులకు ఇచ్చే రాయితీ బస్‌పాస్ పరిధిని పెంచింది. రాయితీ బస్‌పాస్ కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో గ్రామీణ స్కూల్, కాలేజీ విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
New-Bus-Passes
ఇప్పటి వరకు బస్‌పాస్‌ల పరిధి 35 కిలోమీటర్లు ఉండేది. తాజా నిర్ణయంతో అది 50 కిలోమీటర్లకు పెరిగింది. స్కూల్, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఈ నిర్ణయం ఊరట ఇచ్చింది. 35 కిలోమీటర్లు దాటి వెళ్లే విద్యార్థులకు బస్‌పాస్‌లు అర్హత లేకుండా పోయింది. 35 కిలోమీటర్ల పరిధి నిబంధనతో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ సమస్య ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో సానుకూలంగా స్పందించి పరిధిని పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 660 విద్యాసంస్థలు 35 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. విద్యార్థుల కష్టాలను గమనించిన జగన్ ప్రభుత్వం.. రాయితీ బస్‌పాస్‌ల కిలోమీటర్ల పరిధిని 35 నుంచి 50 కిలోమీటర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 15 వేల మంది విద్యార్థులు బస్‌పాస్‌లు పొందనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి 18.50 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :