Monday, August 26, 2019

రైలు టికెట్ బుక్ చేస్తున్నారా ? సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ పడుతుంది



Read also:

ఆన్లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసేవారికి బ్యాడ్ న్యూస్ . ఆన్లైన్ టికెటింగ్ పై సర్వీస్ ఛార్జీని ప్రవేశపెట్టేందుకు ఐఆర్ సీటీసీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ఆన్ లైన్ లో బుక్ చేసే టికెట్లపై గతంలో ఐఆర్ సీటీసీ సర్వీస్ ఛార్జీ తీసుకునేది . అప్పుడు ఏసీ టికెట్లకు రూ . 40 , నాన్ ఏసీ టికెట్లకు రూ . 20 సర్వీస్ ఛార్టీ ఉండేది . కానీ నోట్ల రద్దు తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెంచేందుకు ఆర్థిక శాఖ సర్ ఛార్జీని తొలగించింది . 2016 నవంబర్ 22 నుంచి ఆన్లైన్ లో రైలు టికెట్లు బుక్ చేసేవారికి సర్వీస్ ఛార్జీ లేదు .
railway-service-charge
దీంతో ఐఆర్ సీటీసీకి రెండేళ్లలో రూ . 500 కోట్ల నష్టం వచ్చింది . ఇంకొన్ని రోజుల్లో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్-IPO తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుండటంతో మళ్లీ సర్వీస్ ఛార్జీ అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది . ఐఆర్ సీటీసీలో రైలు టికెట్లు బుక్ చేసే ప్రయాణికులు సెప్టెంబర్ 1 నుంచి సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి రావొచ్చు . అయితే గతంలో లాగా నాన్ ఏసీకీ రూ . 20 , ఏసీకీ రూ . 40 ఉండదు . సర్వీస్ ఛార్జీ కాస్త తక్కువగానే ఉండబోతోంది . ఏసీ టికెట్లకు రూ . 30 , నాన్ ఏసీ టికెట్లకు రూ . 15 సర్వీస్ ఛార్టీ అమలు చేసే ఆలోచనలో ఉంది ఐఆర్ సీటీసీ . UPl / BHIM అప్లికేషన్స్ ద్వారా పేమెంట్ చేస్తే ఏసీ క్లాసెస్ కు రూ . 20 , నాన్ ఏసీ క్లాసెస్ కు రూ . 10 సర్వీస్ ఛార్జీ వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సెబీకి దాఖలు చేసిన రిపోర్ట్ లో వెల్లడించింది ఐఆర్ సీటీసీ .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :