Monday, August 26, 2019

వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచులో టీమిండియా 318 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది



Read also:

టీమిండియా విధించిన 419 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత పేస్‌ బౌలర్ల ధాటికి విండీస్‌ జట్టు 100 పరుగులకే కుప్పకూలింది. కాగా, విండీస్‌ తరపున కీమర్‌ రోచ్‌ (38, 31 బంతులు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 7 పరుగులకే ఐదు వికెట్లు తీసి టెస్టుల్లో కెరీర్‌ బెస్ట్‌ గణంకాలు నమోదు చేయగా, ఇషాంత్‌ శర్మ మూడు, షమి రెండు వికెట్లతో చెలరేగారు. అంతకు ముందు 343/7 పరుగుల వద్ద టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో అర్థ శతకంతో ఆకట్టుకున్న రహానే రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకంతో మెరిసాడు. కాగా, హనుమ విహారి 93 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్థశతకం, శతకంతో రాణించిన అజింక్యా రహానే మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భారత్‌ తమ భోణీని ఘనంగా ఆరంభించింది. ఇక కింగ్స్‌స్టన్‌ వేదికగా సెప్టెంబర్‌ 4 నుంచి భారత్‌ - విండీస్‌ల మధ్య రెండో టెస్టు మ్యాచ్‌ జరగనుంది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :