Monday, July 22, 2019

World bank revealed the information about stopping funds to AP government



Read also:

World bank revealed the information about stopping fund to AP government 

అమరావతికి నిధులు ఆపటం పై సంచలన ప్రకటన?
అమరావతికి నిధులు ఆపటం పై సంచలన ప్రకటన విడుదల చేసిన వరల్డ్ బ్యాంక్... జగన్ మీడియా విష ప్రచారానికి ఫుల్ స్టాప్... అమరావతికి రుణం ఇవ్వం అంటూ కొద్ది రోజులుగా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఎవరికీ వారు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ మీడియా అయితే, కేవలం చంద్రబాబు వల్లే ఈ రుణం ఆగిపోయింది అని, చంద్రబాబు అమరావతిలో అవినీతి చేసారని, అందుకే రుణం ఆపేసారని, చంద్రబాబు ఇన్సెడ్ ట్రేడింగ్ చేసిన విషయం ప్రపంచ బ్యాంకుకు తెలిసిపోయి, రుణం ఆపేసారని. విష ప్రచారం చేసారు. అయితే ఈ వాదనలకు తెర దింపుతూ ప్రపంచ బ్యాంక్ ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసింది. రుణం ఆపటానికి కారణం, భారత ప్రభుత్వం అంటూ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. అమరావతికి రుణం ఇచ్చే ప్రతిపాదనను కేంద్రం ప్రభుత్వం జూలై 15 వ తారీఖున వెనక్కు తీసుకుందని, అందుకే రుణం ఇవ్వలేం అని చెప్పామని చెప్పింది.
World bank given statement to media

అయితే రాజధాని అమరావతి ప్రాజెక్ట్ నుంచి మాత్రమే తప్పుకున్నాం అని , ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో మేము, మా సహయం కొనసాగిస్తాం అని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాలు అయిన, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, విపత్తు నిర్వహణ వంటి రంగాల్లో ఇప్పటికే అనేక బిలియన్ డాలర్ల రుణ సహాయం అందించామని, ఇది ఎప్పటికీ కొనసాగిస్తామని చెప్పింది. ఆరోగ్యం విషయంలో గత నెలలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాం అని చెప్పింది. అయితే ఈ విషయం పై గత రెండు రోజులుగా చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ ఆడిన ఆటలు అన్నీ అబద్దం అని తేలిపోయింది. వైసీపీ నేతలు, చంద్రబాబు వల్లే | అమరావతికి రుణం ఇవ్వలేదంటూ బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళారు.
అయితే అది తప్పుడు ప్రచారం అని తేలింది. మరో పక్క, ఈ రోజు జగన్ మీడియాలో బ్యానేర్ ఐటెంగా, అమరావతి రుణం పై వండి వార్చారు. చంద్రబాబు అవినీతి వల్లే అమరావతికి రుణం ఇవ్వలేదని చెప్పి, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జగన్ విజన్ కు ఆకర్షితులు అయ్యారని చెప్పింది. అంతే కాదు, జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రపంచ బ్యాంకుకు ఎంతో నచ్చాయని, వాటికి రుణం ఇవ్వటానికి ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉందని చెప్పింది. నిజానికి ప్రపంచ బ్యాంక్ ఇలాంటి పధకాలకు రుణం ఇవ్వదు. అయితే, ఇప్పుడు ఏకంగా ప్రపంచ బ్యాంక్ ప్రకటన విడుదల చెయ్యటం చాల ఆనందకరంగ ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :