Monday, July 22, 2019

Interesting facts about chandrayaan2



Read also:

Interesting facts about chandrayaan2

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43     నిమిషాలకు నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌) 16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. అనంతరం 170.06 x 40,400 కి.మీ. కక్ష్యలో చంద్రయాన్‌ 2ను విడిచిపెట్టింది. సగటును 3.84లక్షల కి.మీల దూరం ప్రయాణించనున్న ఈ ఉపగ్రహం సెప్టెంబర్‌ 7న జాబిల్లిపై దిగనుంది.
Interesting facts about chandrayaan2
చంద్రయాన్‌ 2 గురించి ఆసక్తికర విషయాలు?
  •  చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతమైతే అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్‌ల్యాండర్‌ చేసిన దేశంగా భారత్‌ ఘనత సాధించనుంది.
  • చంద్రయాన్‌ 2 ఉపగ్రహం బరువు మొత్తం 3,447 కిలోలు. దీన్ని ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌తో అనుసంధానం చేశారు. వీటిలో ఆర్బిటర్‌ చంద్రుడి చుట్టూ తిరుగుతూ సమాచారాన్ని సేకరిస్తుంది. ల్యాండర్‌ చంద్రుడిపై దిగుతుంది. ల్యాండర్‌పై ఉండే రోవర్‌ జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్లను పరిశోధన చేస్తుంది.
  • చంద్రయాన్‌ 2 ఉపగ్రహం జాబిల్లి కక్ష్యలోకి చేరుకున్న తర్వాత ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌ విడిపోయి చంద్రుడి దక్షిణ ధ్రువం దగ్గరగా నెమ్మదిగా దిగనుంది.
  • అందులోంచి అత్యంత మృదువుగా రోవర్‌ బయటకు వచ్చి సెకెన్‌కు సెంటీమీటర్‌ వేగంతో 14 రోజుల పాటు పయనించనుంది. చంద్రుడి ఉపరితలంపై ఉన్న పదార్థాలను విశ్లేషించి ఆ సమాచారాన్ని, చిత్రాలను పంపించనుంది. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తుంది.
  • చంద్రయాన్‌2 ఉపగ్రహాన్ని చంద్రుడి దక్షిణ ధ్రువంలోకి ప్రవేశపెట్టడం అత్యంత సవాల్‌తో కూడిన పని. ఇస్రో సంపూర్ణ నైపుణ్యం సాధించాలని కోరుకుంటున్న అతి ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం ఇది. ఇస్రో చంద్రుడిపై క్లిష్టమైన సాఫ్ట్‌ ల్యాండర్‌ కోసం చేస్తున్న తొలి ప్రయత్నమూ ఇదే. ఆర్బిటర్‌ నుంచి ల్యాండర్‌, రోవర్‌ను వీడిన తర్వాత 15 నిమిషాలు అత్యంత కీలకమని ఇస్రో శాస్త్రవేత్తలు అంటున్నారు.
  • చంద్రయాన్‌ 2లో అత్యంత సూక్ష్మంగా అత్యంత సమర్థంగా పనిచేసే ఎన్నో పరికరాలను అమర్చారు. చంద్రయాన్‌ 1 జాబిల్లిపై నీటిని గుర్తించగా.. చంద్రయాన్‌ 2 మరింత లోతుగా పరిశోధిస్తుంది. ఇందులో ఖనిజాలు, నీటి అణువుల్ని సవివరంగా గుర్తించే అమేజింగ్‌ ఐఆర్‌ స్పెక్ట్రోమీటర్‌, సింథటిక్‌ అపెర్చర్‌ రాడార్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి ఖనిజాలను మనం తవ్వి తెచ్చుకొనే వీలుందా అనేది తెలుస్తుంది.
  •  చందమామకు సంబంధించిన త్రీడీ మ్యాప్‌లను రూపొందించేందుకు జాబిల్లి పుట్టుక గురించి తెలుసుకొనేందుకు అవసరమైన సమాచారాన్ని చంద్రయాన్‌ 2 సేకరిస్తుంది. 
  •  అంతిమంగా భవిష్యత్తులో మనం అక్కడికి వెళ్లి ఆవాసం ఏర్పాటు చేసుకొనే వీలుందా అన్న ప్రశ్నకు కొంతవరకైనా కచ్చితమైన జవాబు అందిస్తుంది.
  • చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ ప్రాంతంలోనే నీటి ఆనవాళ్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. 
  • చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతమైతే అమెరికా, సోవియట్‌ యూనియన్‌, చైనా తర్వాత చంద్రునిపై సాఫ్ట్‌ల్యాండర్‌ చేసిన దేశంగా భారత్‌ ఘనత సాధించనుంది.
వచ్చే మిగతా  రోజులు అత్యంత కీలకం:
శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్‌ను ఉన్నతంగా ఉంచడమే తమ లక్ష్యమని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అన్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగం అనంతరం శివన్‌ మాట్లాడారు. ఇప్పటికి రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపామన్నారు. అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పారు. మార్క్‌-3 విజయం కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. వచ్చే 45 రోజులు తమకు అత్యంత కీలకమని.. సెప్టెంబర్‌ 7న రాత్రి ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :