Monday, July 22, 2019

AP Government decided to generate new ration cards



Read also:

AP Government decided to generate new ration cards

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి కొడాలి నాని. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం అవుతుందన్నారు. 2019, అక్టోబర్ నుంచి కొత్త కార్డులు ఇంటింటికీ చేరవేయనున్నట్లు వెల్లడించారు. గ్రామ వాలంటీర్లు వీటిని అందజేయనున్నట్లు వెల్లడించారు. అప్పటి వరకు పాత రేషన్ కార్డులు చెల్లుతాయని.. ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు.
AP New ration cards
కొత్త రేషన్ కార్డుల జారీ పారదర్శకంగా ఉంటుందన్నారు. అన్ని వివరాలు అందులో ఉంటాయని.. రేషన్, పెన్షన్, ఆరోగ్యశ్రీ వంటి అన్ని వివరాలతో లబ్ధిదారునికి అవగాహన కల్పించనున్నట్లు వెల్లడించారు. రేషన్ పంపిణీ కూడా ప్యాకేజింగ్ రూపంలో అందజేయనున్నట్లు తెలిపారు.

దీని వల్ల కల్తీకి అవకాశం ఉండదన్నారు. తూకాల్లో మోసాలను అరికట్టవచ్చన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి పనులు మొదలు పెట్టామని.. గ్రామ వాలంటీర్ల నియామకం పూర్తయిన తర్వాత.. లబ్దిదారులకు ఇంటింటికీ వచ్చి ఇస్తారన్నారు. అప్పటివరకు పాత విధానమే కొనసాగుతుందని వివరించారు ఏపీ సివిల్ సప్లయ్స్ మినిస్టర్ కొడాలి నాని.అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా మంత్రి నాని మాట్లాడుతు..ప్రస్తుతం ఉన్న పాత రేషన్ కార్టుల్లో మార్పులు చేర్పులు చేసి కొత్త కార్డులను జారీ చేస్తామని తెలిపారు. సివిల్ సప్లై శాఖలో అవకతవకల్ని సరిదిద్ది పటిష్టంగా అమలు చేస్తామన్నారు. టీడీపీ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు.

పౌరసరఫరాల శాఖలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం, అశ్రద్ధను అసెంబ్లీలో ప్రస్తావించారు మంత్రి. రూ.4 వేల 800 కోట్ల నిధులను మళ్లించారన్నారు. దీని వల్లే రైస్ మిల్లర్లకు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. 2018 లో వెయ్యి కోట్ల రూపాయలు సివిల్ సప్లయ్స్ శాఖ చెల్లించ లేదని.. ఆ బాకీ ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వస్తుందని అన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :