Tuesday, July 23, 2019

New features with Red-Mi K20



Read also:

New features with Red-Mi K20

ప్రపంచ మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువస్తోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సంచలనపు అమ్మకాలను నమోదు చేస్తోంది. టాప్ దిగ్గజాలు ఆపిల్, శాంసంగ్ లకు ధీటైన సవాల్ విసురుతూ మొబైల్ మార్కెట్లో రారాజుగా వెలుగొందుతోంది. అదే ఊపులో ఈ కంపెనీ నుంచి ఇప్పుడు మార్కెట్లోకి అదిరే ఫీచర్లతో సరికొత్త ఫోన్ వచ్చేసింది.
New-Features-with-red-mi-K20
 అయితే తాజాగా రెడ్ మీ కె20 ప్రొ పేరిట జియోమీ  ఓ నూతన స్మార్ట్ ఫోన్ ను బుధవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ తదితర పవర్ ఫుల్ ఫీచర్లను అందిస్తున్నారు. అలాగే వెనుక భాగంలో 48 మెగాపిక్సల్ భారీ కెమెరా ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ఇన్డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ కు చెందిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.27,999 ఉండగా, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.30,999గా ఉంది. ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్, ఎంఐ ఆన్ లైన్ స్టోర్, ఎంఐ హోం స్టోర్లలో ఈ నెల 22వ తేదీ నుంచి వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. రెడ్ మీ కె20 ప్రొ స్మార్ట్ ఫోన్లో 6.39 ఇంచుల డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 855 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్ ఉన్నాయి. అలాగే 128/256 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 13 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ పాపప్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, ఎన్ఎఫ్, యూఎస్ బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ తదితర ఫీచర్లు కూడా ఈ ఫోన్ లో ఉన్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :