Tuesday, July 23, 2019

Red-Mi plan to establish a manufacturing company in AP



Read also:

Red-Mi plan to establish a manufacturing company in AP

ఏపీలో రెడ్ మీ విస్తరణ... జగన్ తో భేటీ అయిన ప్రతినిధులు ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ షావోమి భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో మరో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి చూపింది. దీనికి సంబంధించి షావోమీ సంస్థ ప్రతినిధులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు.
Red-mi plan to establish-comany-in-andra-pradesh
 తమ కంపెనీ గురించి, ఏపీలో తమ ప్లాన్ల గురించి వివరించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. షావోమీకి తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులో ఓ ప్లాంట్ ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటిలో ఫాక్స్ కాన్తో కలసి రెండో ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఏపీలోనే మరో ప్లాంట్ ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వివిధ కంపెనీలు భారత్ లో తయారీకి ముందుకొచ్చాయి. భారత్ లో షావోమీ విక్రయిస్తున్న 95 శాతం ఫోన్లు మనదేశంలోనే తయారవుతున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :