Monday, July 22, 2019

How to book train pass through the app



Read also:

How to book train pass through the app

యూటీఎస్ యాప్ లో టైమ్ పాస్... బుక్ చేయండి ఇలా
తరచూ ఒకే రూట్ లో రైలులో ప్రయాణించేవాళ్లు సీజన్ టికెట్ తీసుకుంటూ ఉంటారు. అయితే కౌంటర్ లోనే సీజన్ టికెట్ తీసుకోవడం చాలామందికి అలవాటు. భారతీయ రైల్వే యూటీఎస్ యాప్ ద్వారా సీజన్ టికెట్స్ని అందిస్తోంది. యూటీఎస్ యాప్లో జనరల్ టికెట్ తీసుకోవచ్చన్న విషయం తెలిసిందే. సీజన్ టికెట్ అంటే మంత్లీ పాస్ ని కూడా యూటీఎస్ యాప్ లో తీసుకోవడం సులువే. రెండు స్టేషన్ల మధ్య తరచూ ప్రయాణించేవారికి ఇది ఉపయోగకరం. యూటీఎస్ యాప్ లో సీజన్ టికెట్ తీసుకుంటే కాపీని ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మొబైల్ యాప్ లోనే టీసీకి చూపించొచ్చు. సీజన్ టికెట్ ను నెలకు మాత్రమే కాదు ఏడాదికి కూడా తీసుకోవచ్చు. మరి యూటీఎస్ యాప్ ద్వారా సీజన్ టికెట్ ఎలా తీసుకోవాలో తెలుసుకోండి. _UTS App: సీజన్ టికెట్ తీసుకోండి ఇలా ముందుగా మీ స్మార్ట్ ఫోన్ లో UTS App డౌన్లోడ్ చేసుకోండి. లాగిన్ బటన్ పైన క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేయండి. లాగిన్ చేసిన తర్వాత 'Book Ticket' ఆపన్ పైన క్లిక్ చేయండి. సీజన్ టికెట్ పైన క్లిక్ చేసి 'Book & Travel (Paperless)' ఆప్షన్ ఎంచుకోండి.
Train pass booking
తర్వాత 'Issue Ticket' పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడైనా సీజన్ టికెట్ తీసుకోవాలంటే 'Renew Ticket' ఆప్పన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సీజన్ టికెట్ కావాలో సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ లేదా సెకండ్ క్లాస్, ఏసీ, నాన్ ఏసీ లాంటి వివరాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. వివరాలన్నీ సరిచూసుకున్న తర్వాత పేమెంట్ చేయాలి. చివరగా 'Done' పైన క్లిక్ చేస్తే ప్రాసెస్ పూర్తవుతుంది. సీజన్ టికెట్ కొన్న తర్వాత 'Show Booked Ticket' ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సీజన్ టికెట్ కనిపిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :