Saturday, May 1, 2021

Debitcard lose: మీరు ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి



Read also:

Debitcard lose: మీరు ఏటీఎం కార్డు పోగొట్టుకున్నారా.. అయితే ఇలా చేయండి.

Debitcard lose: ఈ రోజుల్లో మొబైల్, బ్యాంక్ ఖాతా లేని వారు ఉండరు. అయితే ఒకవేళ ఏటీఎం కార్డు పోగొట్టుకుంటే ఏం చేయాలో చాలామందికి తెలియదు. పోతేపోనీ మరొకటి తీసుకోవచ్చులే అని చాలామంది అనుకుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఖాతా ఖాళీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

Debit_card

డబ్బుల డిపాజిట్ చేయాలన్నా.. విత్ డ్రా చేయాలన్నా ప్రస్తుతం డెబిట్ కార్టు ఎంతగానో ఉపయోగపడుతుంది. బ్యాంక్ కు వెళ్లకుండానే ఏటీఎం సెంటర్ కి వెళ్లి డబ్బులను విత్ డ్రా లేదా డిపాజిట్  చేసుకోవచ్చు.

లావాదేవీల కోసం ఎక్కువగా వాడే ఏటీఎం కార్డు పోతే మాత్రం ఇక అంతే సంగతులు.

ఏటీఎం కార్డు పోయిన వెంటనే అప్రమత్తంగా ఉండాలి లేదంటే.. మన ఖాతాలో డబ్బుల ఇతరులు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కార్డు పోయిన వెంటనే మొదటగా చేయవలసినది.. కార్డును బ్లాక్ చేయాలి.

దీనిని మూడు పద్ధతుల ద్వారా చేయవచ్చు. అందులో మొదటిది ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం ఉన్నవాళ్లు మొదట లాగిన్ అవ్వాలి. అందులో డెబిట్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

ఆ తర్వాత పోయిన డెబిట్ కార్డు వివరాలను నమోదు చేసి బ్లాక్ యువర్ డెబిట్ కార్డ్ ఎంపికపై క్లిక్ చేయడంతో ఆ కార్డు బ్లాక్ అయిపోతుంది.

రెండోది మన మొబైల్ లో యప్ ఉంటే దాని ద్వారా కూడా చేయవచ్చు. ఎస్బీఐ అకౌంట్ యూసర్లు అయితే యోనో యాప్ ఇతర బ్యాంకింగ్ కస్టమర్లు అయితే ఆయా బ్యాంకులకు సంబంధించి యాప్ లు ఉంటాయి. యాప్ ఓపెన్ చేసి డెబిట్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి కార్డును బ్లాక్ చేయవచ్చు. 

మూడో పద్దతి సులువైనది. బ్యాంక్ హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు. వారు అడిగిన వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే హెల్ఫ్ లైన్ నంబర్ల కోసం గూగుల్ సెర్ఛ్ మాత్రం చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

చివరగా మీ ఏటీఎం కార్డు ఎవరైనా దొంగలించినట్లు మీకు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. 

దీనికోసం మీరు కార్డు దొంగతనం జరిగిన సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి నివేదించాల్సి ఉంటుంది.

ఇలా చేయడం వల్ల భవిష్యత్ లో ఉపయోగం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :