Wednesday, April 7, 2021

కరోనా వ్యాప్తి, ఆంక్షల నేపథ్యంలో ఆర్‌బీఐ యధాతథ నిర్ణయం



Read also:

కరోనా వ్యాప్తి, ఆంక్షల నేపథ్యంలో ఆర్‌బీఐ యధాతథ నిర్ణయం

రెపో రేటు 4 శాతం

రివర్స్‌ రెపో రేటు 3.5 శాతం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బీఐ ) కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్థికసంవత్సరంలో మొదటి పాలసీ సమీక్ష ఇది. తాజా నిర్ణయంతో రెపో రేటు 4శాతం వద్ద,రివర్స్‌ రెపో రేటు 3.5 శాతం వద్ద కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ బుధవారం వెల్లడించారు.

రేట్లను యధాతథంగా ఉంచేందుకు మానిటరీ పాలసి కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు.


ఆరుగురు సభ్యుల ద్రవ్య విధాన కమిటీ తన ద్వి-నెలవారీ ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను ఈ రోజు ప్రకటించింది. రెండో దశలో కరోనా వైరస్ కేసులు పెరగడం, తాజా ఆంక్షలునేపథ్యంలో బెంచ్మార్క్ రెపో రేటుపై యథాతథ స్థితిని కొనసాగించాలని నిర్ణయించిందని శక్తి కాంత్‌దాస్‌ వివరించారు. వృద్ధికి తోడ్పడటానికి , ద్రవ్యోల్బణ టార్గెట్‌ను సాధించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. రెండో దశలో విజృంభిస్తున్న కోవిడ్‌ మహమ్మారి ఆర్థికవృద్ధి, రికవరీపై అనిశ్చితిని సృష్టించిందని గవర్నర్ చెప్పారు. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధిని 10.5 శాతంగా, సీపీఐ ద్రవ్యోల్బణం 5.1 శాతంగానూ అంచనా వేసిందన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :