Saturday, March 27, 2021

Exercises for weightloss



Read also:

Exercises for weightloss: ఈ వ్యాయామాలతో రోజుకి 1000 క్యాలరీలు సులువుగా కరిగించేయొచ్చు

బరువు తగ్గించుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఎలా తగ్గాలో అర్థం కాదు. ఆహారం తగ్గించినా, వ్యాయామం చేసినా ఎన్ని డైట్లు మెయింటెయిన్ చేసినా కొంతమంది బరువు మాత్రం తగ్గలేరు. ఇందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. ముందుగా బరువు తగ్గాలంటే మీరు ఖర్చు చేసే క్యాలరీల కంటే తినే క్యాలరీలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే శరీరంలో కేవలం కొవ్వు పేరుకుపోయి ఒబేసిటీకి దారితీస్తుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల వీలైనంతగా క్యాలరీలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి.

-ఆరోగ్యకరంగా బరువు తగ్గడంపై దృష్టిపెట్టాలి. దీనికోసం హెల్దీ డైట్ తీసుకుంటూ శారీరకంగా కూడా వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. మనం తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువగా ఖర్చు చేయడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం కొన్ని రకాల వ్యాయామాలు చేయవచ్చు. అయితే ఎన్ని వ్యాయామాలు చేసినా కొన్ని చిన్న చిట్కాలు పాటించడం వల్ల కూడా ఎక్కువ క్యాలరీలు కరిగించే వీలుంటుంది.

రోజులో 1000 క్యాలరీలు తగ్గాలంటే ఏం చేయాలి?

తగినంత నిద్ర ఉండాలి

క్యాలరీలు అధికంగా కరిగించడానికి మీరు మొదటగా చేయాల్సింది శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం. ఇందుకోసం తగినంత నిద్రపోవాలి. విశ్రాంతి తర్వాత మీరు వాకింగ్ ప్రారంభిస్తే మీ బరువు సులభంగా తగ్గుతుంది. ఒకవేళ మీకు తగినంత నిద్ర లేకుంటే బరువు తగ్గడం సవాలుగా మారుతుంది.

వేగంగా నడక

ట్రెడ్ మిల్ పై మీడియం వేగంతో కనీసం 60 నిమిషాలు నడక సాగించాలి. ఇలా చేయడం ద్వారా రోజులో వెయ్యి క్యాలరీలు తగ్గించుకోవచ్చు. ఒకవేళ బయటకు వెళ్తే గంటకు కనీసం ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరం వెళ్లేలా నడవడం వల్ల తొందరగా క్యాలరీలు కరుగుతాయి.

సైక్లింగ్

మరిన్ని క్యాలరీలు కరిగించడానికి సరదాగా సైక్లింగ్ చేయొచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేయడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో సైక్లింగ్.బరువు తగ్గేందుకు అనుకూలంగా ఉంటుంది.

ఎక్కువగా నీరు తాగండి

వేడి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కొవ్వు కరగడానికి ఎక్కువ అవకాశముంటుంది. త్వరగా బరువు తగ్గాలంటే రోజుకు కనీసం 5 లీటర్ల నీటిని తాగాలి. ఇది మీ ఆకలి బాధను తగ్గించి ఫిట్ గా ఉండేందుకు తోడ్పడుతాయి.

బరువులెత్తడం

బరువులెత్తడం ద్వారా క్యాలరీలు బర్న్ చేయవచ్చు. నిరంతరం బరువులెత్తడం సాధన చేయడం ద్వారా అసహజంగా పెరిగిన బరువును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా బరువులెత్తడం వెయిట్ తగ్గడానికి సులువైన మార్గం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :