Sunday, March 14, 2021

Benefits of Sugarcane Juice



Read also:

Benefits of Sugarcane Juice: సమ్మర్‌ సీజన్‌ వచ్చేసింది.. రోడ్లపై నిమ్మరసం, పుదీనా నీళ్లు, మజ్జిగ, చెరుకు రసాలకు భలే డిమాండ్‌ ఉంటుంది. ఎండలో బయటికి వెళ్ళినపుడు తప్పనిసరిగా ఏదో ఒక కూల్‌డ్రింక్‌ తాగడం హెల్త్‌కి చాలా మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. డీహైడ్రేషన్, అలసట ఎండాకాలంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అయితే, ముఖ్యంగా చెరుకు రసం తాగటం వల్ల మహిళలకు చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తోంది. చెరుకు రసం తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయట. శరీరంలోని మలినాలను తొలగించి ఆరోగ్యాన్ని పెంచుతుందట.

ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. చెరకు రసం సంతానోత్పత్తికి మంచిగా పని చేసే బూస్టర్ అని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొత్తగా తల్లి అయిన వాళ్లలో పాల ఉత్పత్తిని పెంచుతుందట. ఇక మగవారిలో స్పెర్మ్ నాణ్యతని మెరుగుపరచడానికి చెరుకు రసం ఉపయోగపడుతుందట. మహిళలు పీరియడ్స్‌లో వచ్చే నొప్పికి మందుగా చెరుకు రసాన్ని వాడొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం పీరియడ్ వచ్చే కొన్ని రోజుల ముందు తాగితే ఆ సమయంలో వచ్చే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. ఇక చెరుకు రసం డ్యూరెటిక్ వలే పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా వారు చెప్పిన దాని ప్రకారం.. బాడీలోని ఉబ్బరాన్ని, అలసటను తొలగిస్తుంది. అలాగే మూత్రపిండాలు సక్రమంగా పని చేయడానికి చెరుకు రసం సహాయపడుతుంది. దాంతోపాటు కాలేయ పనితీరు ఆప్టిమైజ్ అవుతుంది. కామెర్ల చికిత్సలో కూడా చెరుకు రసం చక్కగా పనిచేస్తుంది.

ఇక మీకు గనక స్మూత్, మృధువైన చర్మం కావాలనుకుంటే చెరుకు రసాన్ని తాగడం చాలా మంచిది. ఇది తాగితే మృధువైన చర్మం మీ సొంతం ఖాయం అవుతుంది. అలాగే మొటిమలు పూర్తిగా నివారిస్తుంది. జుట్టులోని చుండ్రును కూడా పోగొడుతుంది. వారంలో మూడు సార్లు చెరుకు రసం తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా చాల మంచిది. ఎందుకంటే ఇది సహజ డిటాక్స్‌గా ఉపయోగపడుతుందిన వైద్యులు చెబుతున్నారు. ఇక శరీరం వేడెక్కినప్పుడు చెరుకు రసం తాగితే శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. ఇంకా జీర్ణసంబంధమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :