Monday, March 29, 2021

Bank holidays in April 2021



Read also:

Bank holidays in April 2021 : 2021 ఏడాదిలో వచ్చే ఏప్రిల్ నెలలో 15 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవుదినాలను రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) హాలీడే క్యాలెండర్ ను విడుదల చేసింది. ఏప్రిల్‌లో వివిధ పండుగలతో పాటు బ్యాంకు సెలవుదినాలు మొత్తం 15 రోజుల వరకు ఉండనున్నాయి. అందులో బ్యాంకు సెలవులు 9 పండుగ రోజులే. శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, బిహు, ఫ్రీడమ్ ఫైటర్, జగ్జీవన్ రామ్ జన్మదినోత్సవం, కొత్త సంవత్సరాది వరుసగా ఉన్నాయి.

అలాగే రెండో, నాల్గో శనివారంతో పాటు నాలుగు ఆదివారాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో బ్యాంకుల సెలవుదినాలు ఒకేలా ఉండకపోవచ్చు. ప్రత్యేకించి రాష్ట్రం, ప్రాంతాన్ని బట్టి బ్యాంకు సెలవు దినాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.

గెజిటెడ్ హాలీడేలు మాత్రమే దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో సెలవుదినాలు ఉంటాయి. అన్ని బ్యాంకుల్లో ఏప్రిల్ 1న అకౌంట్ క్లోజింగ్ కావడంతో ఆ రోజున పనిచేయవు.

గువాహటిలో ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. హోలీ సందర్భంగా పాట్నాలో నాలుగు రోజులు పనిదినాలు ఉండవు. అలాగే మార్చి 30, ఏప్రిల్ 3న ఈ రెండు తేదీలు మినహా మార్చి 30 నుంచి ఏప్రిల్ 4 వరకు బ్యాంకులకు సెలవుదినాలు. ఆర్థిక సంవత్సరంలో చివరి రోజు కావడంతో మార్చి 31న బ్యాంకు అకౌంట్ల సేవలన్నీ నిలిచిపోతాయి. ఏప్రిల్ నెలలో ఏయే తేదీల్లో బ్యాంకుల కు సెలవులు ఉన్నాయో ఓసారి చూద్దాం.

ఏప్రిల్ బ్యాంకుల సెలవుదినాలు :

ఏప్రిల్ 1 – ఏడాది అకౌంట్ క్లోజింగ్

ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే

ఏప్రిల్ 5 – బాబు జగ్జీవన్ రామ్ జయంతి

ఏప్రిల్ 6 – తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు

ఏప్రిల్ 13 – ఉగాది (తెలుగు సంవత్సరాది), గుది పాడ్వా

ఏప్రిల్ 14 – బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి/తమిళ్ కొత్త సంవత్సరాది/ బీజు పండుగ

ఏప్రిల్ 15 – హిమాచల్ డే/బెంగాలీ కొత్త సంవత్సరాది/బోహగ్ బిహూ/సార్హూల్

ఏప్రిల్ 16 – బోగాహ్ బిహూ

ఏప్రిల్ 21 – శ్రీరామనవమి

ఆదివారాలు- శనివారం సెలవుదినాలు :

ఏప్రిల్ 4 – ఆదివారం

ఏప్రిల్ 10 – రెండో శనివారం

ఏప్రిల్ 11- ఆదివారం

ఏప్రిల్ 18 – ఆదివారం

ఏప్రిల్ 24 – నాల్గో శనివారం

ఏప్రిల్ 25 – ఆదివారం

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :