Thursday, March 4, 2021

మహిళా ఉద్యోగులకు 5 రోజులు ప్రత్యేక సెలవు సీఎం జగన్ అంగీకారం



Read also:

మహిళా ఉద్యోగులకు ఐదు రోజులు స్పెషల్ క్యాజువల్   లీవ్స్  ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవం పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.  మహిళా దినోత్సవం సందర్భంగా  రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు  చేపట్టబోతున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో మహిళా ఉద్యోగులకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.

పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న మహిళలందరికీ  మార్చి 8న స్పెషల్ డే ఆఫ్ గా ప్రకటించారు. ప్రతి  వింగ్ నుంచి  ఇద్దరు మహిళా  కానిస్టేబుల్స్ కు సత్కారం చేయాలని నిర్ణయించారు. నాన్  గెజిటెడ్ మహిళా ఉద్యోగుల సంఘానికి ప్రభుత్వం తరఫున ఐదు లక్షలు కేటాయించారు. అంగన్వాడీ ఉద్యోగులందరికీ ఏటా హెల్త్ చెకప్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఈ సమావేశం లో మహిళా, శిశు సంక్షేమశాఖా మంత్రి తానేటి వనిత, డీజీపీ గౌతం సవాంగ్, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్ష్మి, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ ఏ రవిశంకర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజీత్, డీఐజీ (టెక్నికల్‌ సర్సీసెస్‌) జి పాలరాజు,  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, దిశ ప్రత్యేక అధికారులు కృతికా శుక్లా, దీపికా పాటిల్, ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఛైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :