Friday, February 19, 2021

Include HM Chargememo to five teachers



Read also:

Include HM Chargememo to five teachers-హెచ్‌ఎం, అయిదుగురు ఉపాధ్యాయులకు ఛార్జిమెమో

సీతానగరం: మధ్యాహ్న భోజనం బాగోలేదని కిలోమీటరున్నర దూరం నడిచి విద్యార్థులంతా మూడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన విషయమై విచారణ పూర్తిచేసి చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహం తెలిపారు.

చినకొండేపూడి జడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత లేమిపై ఈనెల 15న విద్యార్థులు ఎంఈవోకు ఫిర్యాదు చేయడంపై ‘జావలా అన్నం.. నీళ్లలా సాంబారు’ శీర్షికన ‘ఈనాడు’లో చిత్ర కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

దీనిపై విచారణకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర డైరెక్టర్‌ దివాన్‌ మొహిద్దీన్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారని డీఈవో చెప్పారు.

ఈ నెల 16, 17 తేదీల్లో విచారణాధికారిగా తనతోపాటు జిల్లా మధ్యాహ్న భోజన పథకం ఏడీ నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో నివేదికలు సేకరించి రాష్ట్ర డైరెక్టర్‌కు పంపామన్నారు.అక్కడ్నుంచి వచ్చిన ఆదేశాలతో ప్రధానోపాధ్యాయిని సుజాత, మరో అయిదుగురు ఉపాధ్యాయులకు గురువారం ఛార్జి మెమోలు జారీ చేశామన్నారు

పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండేవారిని ఇప్పటికే తొలగించామని, విద్యార్థుల భోజనాలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ఎంఈవో చెప్పారు.

రాజమహేంద్రవరం సబ్‌కల్టెకర్‌ అనుపమ అంజలి ఆదేశాలతో డీటీ, ఆర్‌ఐ స్థాయిలో అధికారులు వారానికో రోజు పాఠశాలలో భోజన పథకంపై పర్యవేక్షణ చేసి నివేదికలు పంపుతామని తహసీల్దారు ఎల్‌.శివమ్మ పేర్కొన్నారు. పాఠశాలకు సరఫరా చేసిన బియ్యం నాణ్యతనూ పరిశీలిస్తామని చెప్పారు

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :