Thursday, February 18, 2021

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌పై కసరత్తు



Read also:

  • గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌పై కసరత్తు
  • విధివిధానాల ఖరారుకు నేడు సమావేశం
  • 16 నెలల క్రితం 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
  • దేశ చరిత్రలోనే ఇదో రికార్డు

సాక్షి, అమరావతి: గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందుకు సంబంధించి విధివిధానాలను ఖరారు చేసేందుకు గురువారం వివిధ శాఖాధిపతులతో సమావేశం నిర్వహించనుంది. గ్రామ వార్డు సచివాలయ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, పట్టణాభివృద్ది, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, సీసీఎల్‌ఏ, మహిళా శిశు సంక్షేమ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికారŠుడ్స, సాంఘిక సంక్షేమ శాఖల కమిషనర్లు, డైరెక్టర్లు సమావేశంలో పాల్గొంటారు

జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఎప్పుడూ జరగని రీతిలో కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల వ్యవధిలో కొత్తగా 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించి అప్పటికప్పుడే వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. కాగా, సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్‌ డిక్లరేషన్‌కు ప్రభుత్వం వెంటనే కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య పేర్కొంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :