Friday, February 19, 2021

Amla Squash Recipe



Read also:

Amla Squash Recipe: మనం ఆరోగ్యంగా ఉండాలంటే.మన శరీరంలో కణాలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకోసం మనం వాటికి సంజీవని లాంటి C విటమిన్ ఇవ్వాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే విటమిన్-సీ ఎంతో అవసరం. విటమిన్-సీ ఎక్కువగా సిట్రస్ జాతి పండ్లలో లభిస్తుంది. అందులోనూ ఉసిరిలో పుష్కలంగా ఉంటుంది. భారతీయ సంప్రదాయ వంటకాల్లో ఉసిరితో చేసిన వాటికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగ ఉసిరి జ్యూస్ లేదా ఆమ్లా స్క్వాష్ తీసుకుంటే ఎంతో మేలు చేకూరుతుంది. ఫిట్‌నెస్ పై ఫోకస్ పెట్టే చాలా మంది ఈ జ్యూస్ తప్పక తీసుకుంటారు. ఒక్కసారిగా ఎనర్జీ పెంచుకొని... ఫిట్ గా ఉంటారు. మరి ఆమ్లా స్క్వాష్ ఎలా తయారుచెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమ్లా స్క్వాష్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

ఉసిరి గుజ్జు........................... 1 కేజీ

క్యాండీ షుగర్(పటిక బెల్లం)........ 2 కేజీలు

రాక్ సాల్ట్.............................. 10 గ్రాములు

జీలకర్ర పొడి......................... 10 గ్రాములు

బ్లాక్ పెప్పర్(నల్ల మిరియాలు) పొడి........ 5 గ్రాములు

నల్ల ఉప్పు.................................. 5 గ్రాములు

నీరు............................................ లీటర్

మొత్తం పరిమాణం.3 లీటర్లు. రుచికి తగినట్లుగా మిశ్రమానికి నీటిని కలుపుకోవచ్చు.

ఆమ్లా స్క్వాష్ తయారీ విధానం:

ముందుగా ఉసిరి గుజ్జును ఓ పాత్రలో తీసుకుని స్టవ్‌పై ఉడికించాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కనబెట్టి చల్లార్చాలి. ఓ పెద్ద పాత్రలో చక్కెర తీసుకుని.దానికి సరిసమానంగా నీటిని పోసి వేడి చేయాలి. చక్కెర కరిగిపోయేంత వరకు వేడిచేయాలి. చక్కెర మిశ్రమం.ఉసిరి గుజ్జు కంటే కనీసం 2.5 రెట్లు ఎక్కువగా ఉండాలి. తర్వాత ఉసిరి గుజ్జును పెద్ద పాత్రలో తీసుకుని చక్రెర మిశ్రమం అందులో వేసి నెమ్మదిగా కలపాలి. గుజ్జు, చక్కెర రసం బాగా కలిసిన తర్వాత కొద్దిగా ఈ మిశ్రమాన్ని వేరే పాత్రలో తీసుకోవాలి. జీలకర్రపొడి, రాక్ సాల్ట్, మిరియాలు, నల్ల ఉప్పును ఆ మిశ్రమానికి జోడించాలి. తర్వాత ఈ రెండూ పాత్రల్లో ఉన్న మిశ్రమాలను బాగా కలిపాలి. దీంతో ఆమ్లా స్క్వాష్ తయారీ పూర్తవుతుంది. ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలనుకుంటే కేజీకి 0.75 గ్రాముల పొటాషియం మెటాబిసూల్ఫైట్‌ను కలపాలి. లేదంటే.కొద్ది పరిమాణంలో తయారు చేసుకోవాలి.

ఆమ్లా స్క్వాష్ ఆరోగ్య ప్రయోజనాలు:

ఇందులో విటమిన్-సీ పుష్కలంగా దొరుకుతుంది. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు.జలుబు, దగ్గును నివారిస్తుంది. దీన్ని చల్లార్చి తాగడం ద్వారా యాసిడ్ పెప్టిక్ డిజార్డర్లు, మలబద్దకం, రక్తహీనత, కంటి సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. మందులు వాడటం కంటే ఇలా ఇంట్లోనే తయారుచేసుకొని వాడితే.సైడ్ ఎఫెక్ట్స్ రావు. చక్కటి ఆరోగ్యమూ లభిస్తుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :