Wednesday, February 24, 2021

మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్‌



Read also:

వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. అంతేకాదు రెండు, అంతకన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వ్యక్తులకు కూడా ఇస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రైవేటు ఆసుపత్రులలో వ్యాక్సిన్ వేసుకోవాలని అనుకునే వాళ్లు డబ్బులు చెల్లించాలని జవదేకర్ చెప్పారు. దీనికోసం ఎంత డబ్బు చెల్లించాలో వచ్చే మూడు, నాలుగు రోజుల్లో ఆరోగ్య శాఖ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :