Saturday, January 23, 2021

Unlimited Internet to the villages



Read also:

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మంచి నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి అధికారులకు సీఎం జగన్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే అవి అమల్లోకి రాబోతున్నాయి.

Unlimited Internet: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకూ సిటీలు, పట్టణాల వరకూ ఇంటర్నెట్ అన్‌లిమిటెడ్‌గా లభిస్తోంది. ఇలా ఎన్నాళ్లు.గ్రామాల్లో ప్రజలకు ఇంటర్నెట్ సరిగా అందకపోతే ఎలా అని ఆలోచించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి.నిన్న అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఏపీలోని అన్ని గ్రామాలకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయం అందించాలని ఆర్డరేశారు. కొంత మంది అధికారులు.ఆల్రెడీ పల్లెల్లో నెట్ వస్తోందని చెప్పడంతో.వస్తున్నా.ఎన్నో అవరోధాలు వస్తున్నాయనీ.గ్యాప్ లేకుండా అందాలని సీఎం ఆదేశించారు. సీఎం సడెన్‌గా ఈ ఆదేశాలు జారీచేయడానికి బలమైన కారణం ఉంది. త్వరలో ప్రభుత్వం అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా డబ్బులకు బదులు ల్యాప్‌టాప్ కావాలంటే ఇస్తామని చెప్పింది. మరి ల్యాప్‌టాప్ ఉన్నా ఇంటర్నెట్ లేకపోతే ఏం లాభం అన్న ప్రశ్న వచ్చింది. ల్యాప్‌టాప్‌ల పంపిణీపై సమీక్ష జరిపిన సీఎం అందులో భాగంగా అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ అందించాలని ఆదేశించారు.
మరికొన్ని నిర్ణయాలు:
త్వరలో ప్రభుత్వం ఏపీలోని అన్ని గ్రామాల్లో నెట్‌వర్క్ పాయింట్లు ఏర్పాటుచేయనుంది. అక్కడ ఇంటర్నెట్ లైబ్రరీ ఉంటుంది. అందువల్ల ఐటీ ఉద్యోగులు సైతం.గ్రామాల్లోనే, తమ ఇళ్లలోనే ఉంటూ హై స్పీడ్ నెట్ సదుపాయం పొందుతూ.వర్క్ ఫ్రమ్ హోమ్ చెయ్యవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఓ ప్లాన్ రెడీ చేస్తోంది.
ల్యాప్‌టాప్‌లకు ఆర్డర్:
వచ్చే ఏడాది 9 నుంచి ఇంటర్ చదివే విద్యార్థులకు.వారి తల్లులు అమ్మఒడి డబ్బుల బదులు ల్యాప్‌టాప్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం భారీ ఎత్తున ల్యాప్‌టాప్‌లు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏ కంపెనీకి ఆర్డర్ ఇవ్వాలి, అవి ఎలా ఉండాలి అనే అంశంపై ప్రభుత్వం ప్లాన్ రెడీ చేసుకుంటోంది. ఎవరైనా ల్యాప్‌టాప్ పాడైందని గ్రామ సచివాలయానికి తీసుకొస్తే.దాన్ని తీసుకొని వారం లోపే రిపేర్ చేయించి ఇవ్వాలని ప్రభుత్వం డిసైడైంది. ల్యాప్‌టాప్‌లు ఇచ్చే కంపెనీలు మూడేళ్ల సర్వీస్ వారంటీ ఇచ్చేలా ఉండాలని సీఎం ఆదేశించారు.
కేబుల్స్ ఏర్పాటు:
కంటిన్యూగా ఇంటర్నెట్ బాగా రావాలంటే కేబుల్స్ బలమైనవి ఉండాలని అధికారులు సూచించడంతో.ఆ దిశగా చర్యలు చేపట్టమని సీఎం జగన్ ఆదేశించారు. ఇంటింటికీ ఇంటర్నెట్ వచ్చేలా చేయాలన్నారు. ఇందుకోసం ఓ పవర్‌ఫుల్ వ్యవస్థను ఏర్పాటుచేయాలన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :