Saturday, January 23, 2021

Nimmagadda ramesh kumar live about ap elections



Read also:

Nimmagadda Ramesh Kumar live about ap elections

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓవైపు ఎన్నికలు నిర్వహించాల్సిందే అని ఎన్నికల సంఘం, కరోనా వ్యాక్సినేషన్‌ వేళ ఎన్నికలు నిర్వహించడం కుదరదని రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఇరు వర్గాల మధ్య రచ్చ కొనసాగుతూనే ఉంది. ఎన్నికలు నిలిపేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరిచడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చర్యలు వేగవంతం చేశారు.

ఇందులో భాగంగానే శుక్రవారం పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంతో నిమ్మగడ్డ అధికారుల తీరుపట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పంచాయతీ ముఖ్యకార్యదర్శి ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ గైర్హాజరు కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారిద్దరికీ ఎస్ఈసీ మెమోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నిమ్మగడ్డ మరికాసేపట్లో మీడియా ముందుకు రానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
4 దశల్లో ఎన్నికల నిర్వహణ.
ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్ననేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ మరికాసేపట్లో తొలిదశ నోటిఫికేషన్‌ విడుదల చేయనుండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో మరికాసేపట్లో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయడానికి ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలను 4 దశల్లో నిర్వహించడానికి ఎన్నికల సంఘం సన్నద్ధమవుతోంది.
ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్‌ విధి
ఆంధప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జరగుతోన్న చర్చపై స్పందించడానికి మీడియా ముందుకు వచ్చిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌.. ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్‌ విధి అని అన్నారు. ఎన్నికల కమిషన్‌కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, ఇప్పుడు.. ఎప్పుడు ఎల్లవేళలా ఉన్నాయని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు.
ఏపీలో జరగోయే ఎన్నికల ప్రక్రియకు ఎవరైనా విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హెచ్చరించారు. హైకోర్టు ఇచ్చిన అనుమతితోనే ఎన్నికలు నిర్వహిస్తున్నామని తేల్చిచెప్పారు.
ఈ జిల్లాలో తొలి విడత ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీ ఎన్నికలు జరగబోయే ఎన్నికలను తొలి విడతలో భాగంగా ప్రకాశం, విజయనగరం జిల్లాలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ తెలిపారు. ఈ విషయమై అన్ని జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు, ఎన్నికల ఏర్పాట్లన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ భావిస్తోందని నిమ్మగడ్డ అభిప్రాయపడ్డారు. ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు పోలింగ్‌ జరగనున్నట్లు తెలిపారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :