Monday, January 18, 2021

Green Peas Health Benefits



Read also:

Green Peas Health Benefits

బఠాణీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వీటిని రెగ్యులర్‌గా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.

  • బఠాణీలు నోటికి రుచినివ్వడమే కాదు.వీటిని తీసుకోవడం వల్ల చక్కని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
  • ఒమేగా 3 ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్న బఠాణీలను తీసుకోవడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
  • అల్జీమర్స్, ఆర్థరైటీస్ వంటి జబ్బులు రాకుండా బఠాణీల్లోని పోషకాలు అడ్డుకుంటాయి. ఎముకల్ని కాపాడతాయి.
  • కొవ్వు శాతం తక్కువగా ఉన్న బఠాణీల్లో ప్రోటీన్, ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి... బరువు తగ్గాలనుకునేవారు.వీటిని అధికంగా తీసుకోవాలి.
  • బఠాణీల్లోని అధికమొత్తంలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్.పొట్ట క్యాన్సర్‌ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి.
  • ఫ్లేవనాయిడ్స్, యాంటీయాక్సిడెంట్స్ కలిగిన బఠాణీలను తినడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది.
  • ఫైబర్ అధికంగా ఉన్న బఠాణీలు తీసుకోవడం వల్ల రక్తసరఫరా సరిగ్గా జరుగుతుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ రాకుండా ఉంటుంది.
  • బీ1, బీ2, బీ3, బీ6 విటమిన్స్ కలిగిన బఠాణీలు తీసుకోవడం వల్ల గుండెసమస్యల ముప్పు నుంచీ తప్పించుకోవచ్చు.
  • ఒక కప్పు బఠాణీలు 44శాతం విటమిన్ Kని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి.
  • మార్కెట్‌లో ఏడాది మొత్తం దొరికే బఠాణీలను ఇష్టంగా తిని లాభాలు పొందండి.. బహిరంగ మార్కెట్‌లో కేజీ రూ.40-50కి దొరుకుతున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :