Monday, January 18, 2021

AP Election info



Read also:

ఎస్‌ఈసీ పిటిషన్‌ ఆమోదయోగ్యంగా లేదు-ఏజీ శ్రీరామ్‌
పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో రాష్ట్ర ఎన్నికల సంఘం పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏజీ శ్రీరామ్‌ తన వాదన వినిపించారు.
AG_Sriram

'రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన రిట్ అప్పీల్ విచారణకు ఆమోదయోగ్యమైనది కాదు.ఎన్నికల ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు.సీఎస్‌, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్‌ఈసీ ఏకపక్షంగా వ్యవహరించింది.. ఆ దురుద్దేశంతోనే ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న కరోనా వ్యాక్సినేషన్ గురించి ఏజీ శ్రీరామ్‌ ధర్మాసనంకు వివరించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రభుత్వం ముందు వ్యాక్సిన్ అందిస్తుందని పేర్కొన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :