Tuesday, January 5, 2021

మీ ప్రమేయం లేకుండా బ్యాంక్ లో డబ్బు కట్ అయితే



Read also:

మీ బ్యాంక్ అకౌంట్ నుండి మనీ కట్ అయిపోతున్నాయా మీ ప్రమేయం లేకుండానే కట్ అవుతున్నాయా మీ నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా మీ డెబిట్ క్రెడిట్ కార్డు నుంచి లావాదేవీలు జరిగితే ఒక వేళ అకౌంట్ కానీ కార్డులు కానీ హ్యాక్ అయితే మీరు భయపడాల్సిన పని లేదు. బ్యాంకు అధికారులకు జరుగుతున్న మోసాన్ని తెలియజేయండి.  బ్యాంకులే బాధ్యత వహిస్తాయి. మీ ప్రమేయం లేకుండా మీ ఖాతా నుండి డబ్బు కట్ అయితే బ్యాంకులే బాధ్యత వహించాలని ఆర్బీఐ సైతం ఆదేశించింది.

ఖాతాదారుడి నగదు అతడి ప్రమేయం లేకుండా వినియోగిస్తే దానికి బ్యాంకులే బాధ్యత వహించాలని జాతీయ వినియోగదారుల కమిషన్ గతంలో ఒక తీర్పును ఇచ్చింది. దానికి ఆర్బీఐ సైతం అంగీకరిస్తూ కొన్ని నియమ నిబంధనలు సైతం 2018లో రూపొందించింది. దాని ప్రకారం ఒక అకౌంట్ హ్యాకింగ్ కు గురైతే ఎవరు బాధ్యత వహించాలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బ్యాంకు నుంచి పొరపాటు బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల కారణంగా తప్ప జరిగితే అప్పుడు కస్టమర్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మొత్తం నష్టాన్ని బ్యాంకులే భరించాలని తెలిపింది.  

బ్యాంకు ఖాతా లావాదేవీల్లో కస్టమర్ నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే అప్పుడు కస్టమర్ నష్టాన్ని భరించాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఒక వేళ కస్టమర్ తప్పు లేదా బ్యాంకు తప్పు లేని పరిస్థితిలో ఆ సందర్భంలో కస్టమర్ మోసం జరిగిన 3 పని దినాలలోపు బ్యాంకుకు ఫిర్యాదు చేయాలని సూచించింది. అప్పుడు కస్టమర్ తన నష్టానికి బాధ్యత వహించడు. అదే సమయంలో 4-7 రోజుల్లో ఫిర్యాదు చేస్తే కస్టమర్ 5000 – 25000 రూపాయలు పొందే వెసులుబాటును కల్పించింది. 7 పనిదినాల తర్వాత కస్టమర్ తనకు జరిగిన మోసాన్ని గుర్తించి ఫిర్యాదు చేస్తే అటువంటి సందర్భాలలో బ్యాంక్ విధానం ఏమిటో దానిపై ఆధారపడి ఉంటుందని వివరించింది.

అసలు మార్పుకి గల కారణం ఏంటి అంటే .. మహారాష్ట్రలోని థానేలో నివసిస్తున్న ఒక వ్యక్తి అమెరికాలోని లాస్ ఏంజిల్స్లో నివసిస్తున్న కొడుకు కోసం స్థానిక బ్యాంకులో ప్రీపెయిడ్ ఫారెక్స్ ప్లస్ కార్డును 2007లో తీసుకున్నాడు. తర్వాత డిసెంబర్ 2008 లో ఆ తండ్రి తన ఖాతా నుంచి 10 310 ఉపసంహరించుకున్నట్లు ధృవీకరించమని బ్యాంక్ కోరింది. దానికి అతడు అలాంటి లావాదేవీలు జరపలేదని తెలిపాడు. తిరిగి డిసెంబర్ 14 నుంచి 20 మధ్య 6 వేల డాలర్లను వారి ఖాతా నుంచి ఉపసంహరించుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. దీనిపై లాస్ ఏంజిల్స్లో ఉండే జెస్నా తన తండ్రి ప్రమేయం లేకుండా ఎటువంటి లావాదేవీలు జరపకుండా నగదు ఉపసంహరణకు గురైందని గుర్తించాడు. తన తండ్రి ఖాతా హ్యాక్ అయిందని ఆరోపించాడు. తండ్రితో మహారాష్ట్ర జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేపించాడు. ఫోరం జెస్నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ నిర్ణయానికి నిరసనగా బ్యాంక్… జాతీయ వినియోగదారుల కమిషన్ను సంప్రదించింది. అక్కడ కూడా బ్యాంక్కు చుక్కెదురైంది. బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరించి బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆ ఉత్తర్వుల ప్రకారం బాధితులకు నగదు మొత్తం US $ 6110 తో సహ 12 శాతం వడ్డీతో తిరిగి ఇవ్వాలని బ్యాంకును ఆదేశించింది. అంతేకాకుండా రూ .40 వేలు పరిహారంగా కేసు ఖర్చులకు గానూ రూ .5000 బ్యాంకు చెల్లించాల్సి వచ్చింది. ఖాతాదారులకు జరిగే మోసాల విషయంలో ఖాతాదారుల నగదుకు భద్రత వహించాల్సింది బ్యాంకులేనని బ్యాంకింగ్ లోపాలను సరిదిద్దు కోవాలని కస్టమర్ల ఖాతాలకు నగదుకు బాధ్యత వహించాల్సింది బ్యాంకులేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ వినియోగదారుల ఫోరం స్పష్టం చేశాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :