Tuesday, January 12, 2021

AP Transfers info



Read also:

Development of 7th class Textbooks for the  academic year 2021-22

Transfers of HMs again to the first

  • హెచ్‌ఎంల బదిలీలు మళ్లీ మొదటికి
  • హైకోర్టు ఆదేశాలతో ఆప్షన్లకు తాజా షెడ్యూలు

గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ప్రధానోపాధ్యాయులు మళ్లీ ఆప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఇమ్మన్నారు. కొత్తగా ఖాళీల ప్రకటనకు, ఆన్‌లైన్‌లో ఆప్షన్లు పెట్టుకొనేందుకు, బదిలీ సీనియారిటీ తుదిజాబితా ప్రకటనకు ప్రభుత్వం తాజాగా షెడ్యూలు జారీచేసింది. ఈమేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన పరస్పర విరుద్ధ ఉత్వర్వుతో ఈ బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. హెచ్‌ఎంల బదిలీలకు సంబంధించి ఒక పాఠశాలలో 5 విద్యాసంవత్సరాలు పూర్తయిన అందరూ తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని మొదట ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తర్వాత  ఉపాధ్యాయ సంఘాల నాయకుల ప్రాతినిఽథ్యంతో ఆ నిబంధనను మార్చింది. ఐదు విద్యాసంవత్సరాలు బదులుగా ఐదేళ్లు పూర్తయిన వారికి మాత్రమే స్థాన చలనం కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నిబంధనతో అనేకమంది హెచ్‌ఎంలు బదిలీ వేటు నుంచి తప్పించుకున్నారు. దీంతో తప్పనిసరిగా బదిలీ కావాల్సిన హెచ్‌ఎంలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ మేరకు మొదట జారీచేసిన ఉత్తర్వుల ప్రకారమే బదిలీలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

AP Transfers info

తాజా షెడ్యూల్‌ ఇదీ

హెచ్‌ఎంల బదిలీలకు సంబంధించి సవరించిన తాజా షెడ్యూల్‌ను పాఠశాల విద్య డైరెక్టర్‌ జారీచేశారని డీఈవో వీఎస్‌సుబ్బారావు తెలిపారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 11తేదీకి కొత్త ఖాళీలను ప్రకటించాలి. ఈనెల 12 నుంచి 16వరకు ఐదురోజులపాటు హెచ్‌ఎంలు పాత ఖాళీలతోపాటు తాజాగా ప్రకటించిన ఖాళీలను కూడా తాజాగా ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు. ఈనెల 17, 18తేదీల్లో బదిలీల సీనియారిటీ తుదిజాబితాను ప్రకటిస్తారని డీఈవో తెలిపారు. 

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :