Monday, January 11, 2021

Hydrating Drinks In Winter



Read also:

Hydrating Drinks In Winter: చలిగా ఉండటంవల్ల నీళ్లు తాగాల్సిన అవసరం లేదనుకోవడం సరికాదు. ఈ సీజన్‌లో ఉండే పొడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల దాహం తీర్చడానికి మాత్రమే కాకుండా, రోజంతా చురుగ్గా ఉండటానికి మంచినీరు తాగాలి.

మన శరీర జీవక్రియలు సరిగ్గా జరగాలంటే రోజూ తగినంత మంచినీరు తాగాలి. వేసవిలో మాదిరిగానే శీతాకాలంలో కూడా మనం డీహైడ్రేషన్‌కు గురవుతాం. చలిగా ఉండటంవల్ల నీళ్లు తాగాల్సిన అవసరం లేదనుకోవడం సరికాదు. ఈ సీజన్‌లో ఉండే పొడి వాతావరణం మన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల దాహం తీర్చడానికి మాత్రమే కాకుండా, రోజంతా చురుగ్గా ఉండటానికి మంచినీరు తాగాలి. తగినన్ని నీళ్లు తాగడం వల్ల చర్మం, జుట్టు తేమగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కానీ వేసవిలో మాదిరిగా ఈ సీజన్‌లో ఎక్కువగా నీరు తాగలేం. ఇలాంటప్పుడు కొన్ని రకాల జ్యూస్‌లు తీసుకోవచ్చు.
పాలు, కొబ్బరినీళ్లు, కలబంద జ్యూస్ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరాన్ని తేమగా ఉంచుతాయి. శరీరం, మెదడు చురుగ్గా ఉండటానికి సహాయపడే ఎలక్ట్రోలైట్లు, సోడియం, విటమిన్లు, ప్రోబయోటిక్స్, ఖనిజాలు వంటివి వీటి ద్వారా అందుతాయి.
1. కొబ్బరి నీళ్లు
సీజన్‌తో సంబంధం లేకుండా తరచుగా కొబ్బరినీళ్లు తాగడం వల్ల ఖనిజాలు, పోషకాలు శరీరానికి అందుతాయి. దీంట్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కెలొరీలు తక్కువ మొత్తంలో ఉంటాయి. మామూలు నీటి కంటే మెరుగైన హైడ్రేటింగ్ లక్షణాలు దీంట్లో ఉంటాయి. ఈ నేచురల్ ఎనర్జీ డ్రింక్‌ను ప్యాకేజ్డ్ స్పోర్ట్స్ డ్రింక్, ఎనర్జీ డ్రింక్స్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. పాలు
డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా పాలు తాగాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవటానికి నీటితో పోలిస్తే పాలు బాగా పనిచేస్తాయి. స్వచ్ఛమైన పాలలో నాణ్యమైన పిండి పదార్థాలు, ప్రోటీన్లు, సోడియం వంటివి ఉంటాయి. ఇవి శరీరం ద్రవాలను నిలుపుకోవడంలో సహాయపడతాయి. నేరుగా పాలు తాగడానికి ఇష్టపడనివారు వివిధ రకాల మిల్క్‌షేక్‌లు, స్మూతీలు తీసుకోవచ్చు. పెరుగుతో చేసిన మజ్జిగ లేదా లస్సీని కూడా ఎంచుకోవచ్చు.
3. నిమ్మకాయ రసం
నిమ్మకాయ రసం ఒక మంచి హైడ్రేటింగ్ డ్రింక్‌. నిమ్మకాయరసం, రాక్ సాల్ట్‌ కలిపి తీసుకునే జ్యూస్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది శరీరాన్ని తేమగా ఉంచుతుంది. దీని ద్వారా శరీరానికి తగినంత విటమిన్ సి అందుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
4. కలబంద జ్యూస్
కలబందను సూపర్‌ ఫుడ్ అనికూడా అంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సౌందర్య ఉత్పత్తుల్లో, చర్మ సంరక్షణకు కూడా కలబందను ఉపయోగిస్తారు. దీంట్లో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీని గుజ్జుతో చేసుకునే జ్యూస్‌ను క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరం తేమగా ఉంటుంది. కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా వృద్ధికి కలబంద తోడ్పడుతుంది. శరీరంలో పేరుకుపోయే మలినాలను కలబంద బయటకు పంపించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
5. హెర్బల్ టీలు
ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ రకాల హెర్బల్‌ టీలు మనకు అందుబాటులో ఉన్నాయి. మందార టీ, రోజ్ టీ, చమోమిలే టీ.వంటి హెర్బల్ టీలు శీతాకాలంలో మంచి హైడ్రేటింగ్ డ్రింక్స్‌గా పనిచేస్తాయి. సహజంగా లభించే పదార్థాలతో వీటిని తయారు చేస్తారు. కెఫిన్ కూడా ఉండదు కాబట్టి ఈ సీజన్‌లో వీటిని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు. హెర్బల్‌ టీల వల్ల కొన్ని రకాల హార్మోన్లు విడుదలయ్యి.శరీరం, మనసు ప్రశాంతంగా ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :