Monday, January 11, 2021

AP Transfers info



Read also:

  • ఉపాధ్యాయ బదిలీలు: తెలుగు, హిందీ టీచర్లకు తీపికబురు
  • AP : తెలుగు, హిందీ టీచర్లకు తీపికబురు
  • అప్గ్రేడ్ అయిన పోస్టులతో కలిపి తిరిగి ఖాళీల ప్రకటన
  • బదిలీలకు కొత్త షెడ్యూల్
  • 12 నుంచి ఆప్షన్లకు అవకాశం
  • 17,18 తేదీల్లో సీరియారిటీ జాబితా
జిల్లాలో బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్న తెలుగు, హిందీ స్కూలు అసిస్టెంట్లకు తీపి కబురు అందింది. 2019లో అప్ గ్రేడ్ అయిన స్కూల్ అసిస్టెంటు తెలుగు, హిందీ స్థానాలను ప్రస్తుత కౌన్సెలింగ్లో ఖాళీలుగా ప్రభుత్వం చూపనుంది. ఈ విషయమై హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయాలని పాఠ శాల విద్య డైరెక్టర్ డీఈవోలను ఆదేశించారు. ఉన్నత, ప్రాథమికోన్నత పాఠ శాలల్లోని గ్రేడ్-2 తెలుగు, హిందీ, భాషోపాధ్యాయుల పోస్టులన్నింటినీ ప్రభుత్వం గతంలో స్కూలు అసిస్టెంట్లుగా అప్ గ్రేడ్ చేసింది. ఈ పోస్టుల్లో అర్హత ఉన్న గ్రేడ్-2తోపాటు, ఎస్పీ టీలను నియమించింది. 2019 డిసెంబ లో ఈ ప్రక్రియ నిర్వహించింది. అప్గ్రేడ్ అయిన పోస్టులను కూడా ప్రస్తుత బదిలీల్లో ఖాళీగా చూపించాలని తెలుగు, హిందీ స్కూల్ అసిస్టెం ట్లు ప్రభుత్వాన్ని కోరారు. పట్టించుకోకపోవడంతో వారు కోర్టును ఆశ్రయిం చారు. వీరి వాదనను విన్న హైకోర్టు అప్గ్రేడ్ అయిన పోస్టులను కూడా ప్రస్తుత బదిలీల్లో ఖాళీలుగా చూపించాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వు లను జారీ చేసింది.

కొత్త షెడ్యూల్ ఇదీ

స్కూల్ అసిస్టెంటు తెలుగు, హిందీ టీచర్ల బదిలీలకు ప్రభుత్వం కొత్త షెడ్యూల్ ను ప్రకటించిందని డీఈవో సుబ్బారావు తెలిపారు. ఈ ప్రకారం ఈనెల 11లోపు బదిలీ అప్గ్రేడ్ పోస్టులను కొత్త ఖాళీలుగా ప్రకటించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 12 నుంచి 16 వరకూ 5రోజులపాటు కొత్తగా ఆప్షన్లు ఇచ్చేందుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. 1718 తేదీల్లో బదిలీల తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తామని డీఈవో చెప్పారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :