Friday, December 25, 2020

Telegram news



Read also:

టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్ ఆ ఫీచర్లు వాడుకోవాలంటే డబ్బులు కట్టాల్సిందే.

Telegram Pay for Services: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది నుంచి తీసుకురానున్న ప్రత్యేక ఫీచర్లను వాడుకోవాలంటే డబ్బులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పింది.ఇప్పటివరకు ఈ యాప్ సేవలను దాదాపు 500 మిలియన్ల మంది యూజర్లు పొందుతున్నారు. ఇంతమంది యూజర్లు ఉన్నారంటే ఆ యాప్ ఎంతగా యూజర్ల మన్నలను పొందిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ యూజర్లంతా ఈ యాప్ సేవలను ఉచితంగానే పొందుతున్నారు.

అయితే తాజాగా టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తమ యాప్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. వచ్చే ఏడాది నుంచి టెలిగ్రామ్ లో తీసుకురానున్న కొన్ని ప్రత్యేక ఫీచర్లను వాడుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశాడు.

మార్కెట్లో ప్రస్తుతం ఉన్న తీవ్ర పోటీ కారణంగా కంపెనీ కార్యకలాపాలను నిర్వహించడానికి కొంత డబ్బులు అవసరమని ఆయన అన్నారు. ఇప్పటి వరకు కంపెనీ నిర్వహణ ఖర్చులను చెల్లించాడనికి నేను తన వ్యక్తిగత పొదుపుల నుండి నగదు చెల్లిస్తున్నట్లు అని దురోవ్ వివరించారు

అయితే.. ప్రస్తుతం ఉచితంగా అందిస్తున్న సేవలను అలాగే కొనసాగిస్తామన్నారు. కానీ, కొత్తగా బిజినెస్ టీమ్స్, పవర్ యూజర్ల కోసం తీసుకురానున్న ఫీచర్ల కోసం మాత్రం ప్రీమియం యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేయనున్నట్లు చెప్పారు.

2013లో పావెల్ దురోవ్, అతని సోదరుడు నికోలాయ్ టెలిగ్రామ్ ను ప్రారంభించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :