Friday, December 25, 2020

Milk ang gee Adulteration



Read also:

పాలు, నెయ్యి కల్తీని గుర్తించడం పెద్ద కష్టం కాదు.. ఇలా చేస్తే సరిపోతుంది

Milk Adulteration: పాలు, పాల ఉత్పత్తుల్లో కొన్ని రకాల రసాయనాలు కలుపుతూ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో మార్కెట్లోకి వచ్చే పాలు, నెయ్యి, కోవా, పనీర్ వంటి వాటిని కల్తీ చేస్తున్నారు.

ఈ రోజుల్లో ఆహార పదార్థాల కల్తీ చేసేవారు ఏమాత్రం అనుమానం రాకుండా వాటిని ప్రజలకు చేరవేస్తున్నారు. పాలు, పాల ఉత్పత్తుల్లో కొన్ని రకాల రసాయనాలు కలుపుతూ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు.

బ్రాండెడ్ కంపెనీల పేరుతో మార్కెట్లోకి వచ్చే పాలు, నెయ్యి, కోవా, పనీర్ వంటి వాటిని కల్తీ చేస్తున్నారు. ఇందుకు పిండి, యూరియా, వనస్పతి, ఫార్మాలిన్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కృత్రిమ రంగులు వాడుతున్నారు.

మనం ఇంటికి తీసుకువచ్చిన ఇలాంటి పదార్థాలు స్వచ్ఛమైనవో లేదో తెలుసుకునేందుకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. వీటిని ప్రయత్నిస్తూ కల్తీ చేసిన ఉత్పత్తులకు, అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు.

పాలలో నీళ్లు, గంజి పొడి, పిండి, యూరియా, వనస్పతి వంటివి కలిపి కల్తీ చేస్తారు. పాలలో పిండి లేదా గంజి పొడి కలిపి, వాటిని చిక్కటి పాలు అంటూ నమ్మిస్తారు. ఈ కల్తీని గుర్తించడానికి ఒక చిన్న గ్లాసులో పాలు తీసుకొని, దాంట్లో ఒక చుక్క అయోడిన్ వేయాలి.

పాల రంగు మారితే దాంట్లో గంజిపొడి లేదా పిండి కలిపినట్లు గుర్తించాలి. గ్లాసు పాలలో సోయాబీన్ పొడి వేసి బాగా కలిపి ఐదు నిమిషాలు పక్కన పెట్టాలి. దాంట్లో రెడ్ కలర్ లిట్మస్ పేపర్‌ను ముంచాలి. పాలలో యూరియా కలిపితే లిట్మస్ పేపర్‌ బ్లూ కలర్‌లోకి మారుతుంది.

పాలలో వనస్పతి లేదా డాల్డా కలుపుతారు. దీన్ని గుర్తుపట్టడానికి గ్లాసు పాలలో కొన్ని చుక్కల హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఒక టీస్పూన్ చక్కెర కలపండి. అవి ఎరుపు రంగులోకి మారితే డాల్డా కలిపినట్లేనని భావించాలి.

స్వచ్ఛమైన పనీర్ చాలా మృదువుగా ఉంటుంది. ఇది కొద్దిపాటి బరువును, ఒత్తిడిని తట్టుకుంటుంది. పనీర్‌లో బేకింగ్ సోడా కలిపి కల్తీ చేస్తారు. దీన్ని సులభంగా గుర్తించవచ్చు.

పనీర్ ముక్కను చేత్తో తీసుకుని, సున్నితంగా ఒత్తి చూడండి. కల్తీ జరిగితే అది వెంటనే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది. పనీర్ ముక్కను నీటిలో ఉడకబెట్టి చల్లార్చాలి. అనంతరం దానికి అయోడిన్ ద్రావణం కలపాలి. ఏవైనా రసాయనాలు, పిండి కలిపి కల్తీ చేస్తే.. పనీర్ బ్లూ కలర్‌లోకి మారుతుంది.

ఒక గిన్నెలో టీ స్పూన్ నెయ్యి తీసుకొని, దాంట్లో ఐదు మిల్లీలీటర్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ (HCL) లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ కలపాలి. కల్తీ జరిగితే నెయ్యి రంగు మారుతుంది. నెయ్యిలో డాల్డా కలిపి కల్తీ చేస్తుంటారు. దీన్ని గుర్తించడానికి ఒక చెంచా నెయ్యిలో కొన్ని చుక్కల HCL, చిటికెడు చక్కెర కలపాలి

అది ఎరుపు రంగులోకి మారితే డాల్డా కలిసినట్లేనని గుర్తించాలి. నెయ్యిలో బంగాళాదుంపల రసం కూడా కలిపి మోసం చేస్తారు. దీన్ని గుర్తించడానికి నెయ్యికి కొన్ని చుక్కల అయోడిన్ కలపాలి. కల్తీ చేసిన నెయ్యి గులాబీ రంగులోకి మారుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :