Sunday, December 13, 2020

Solar Eclipse 2020



Read also:

Solar Eclipse 2020: సూర్య గ్రహణం మనపై ప్రభావం చూపిస్తుందనీ.ఆ రోజు కొన్ని కార్యక్రమాలు చేపట్టాలనీ, కొన్ని అస్సలు చెయ్యకూడదని పండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

ఈ సంవత్సరపు చివరి సంపూర్ణ సూర్యగ్రహణం రేపు రాబోతోంది. ఈ సూర్యగ్రహణాన్ని ప్రపంచ దేశాలు చూడబోతున్నాయి. ఆ రోజున సూర్యుడు, భూమి మధ్యకు చందమామ రాబోతోంది. దాంతో.సూర్య కిరణాలు భూమిపై పడటం మానేస్తాయి. చంద్రుడి వల్ల మనకు సూర్యుడు కనిపించడు. ఐతే.ఇండియాలో ఇది అంతగా కనిపించదు. దక్షిణ అమెరికా, అక్కడి చిలీ, అర్జెంటినా ప్రజలకు సూర్యగ్రహణం సమయంలో చీకటి అవుతుంది. అలాగే.పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాల్లో ఉన్న నౌకల నుంచి కూడా ఈ సూర్యగ్రహణం బాగా కనిపిస్తుంది. అక్కడి వారు సంపూర్ణ సూర్యగ్రహణాన్ని చూస్తారు. అది ఏర్పడినప్పడు వారికి పగలే చీకటి అవుతుంది.

సూర్యగ్రహణం సమయం:

రేపు వచ్చే సూర్యగ్రహణం 5 గంటలపాటూ ఉంటుంది. ఇది ఇండియాలో ఉదయం 7.03 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.23 గంటలకు ముగుస్తుంది.

భారతీయులకు కనిపిస్తుందా

భారత్ సహా మిగతా దేశాల దేశాల ప్రజలకు పాక్షికమైన సూర్యగ్రహణం కనిపిస్తుంది. అందువల్ల చీకటి అవ్వదు. కానీ.సూర్యుడి ముందు నుంచి నీడలా చందమామ వెళ్తున్న దృశ్యాన్ని ప్రత్యేక కళ్లద్దాలతో చూడవచ్చు.మామూలు కళ్లతో సూర్యగ్రహణం చూస్తే కళ్లకు ప్రమాదం కాబట్టి.ప్రత్యేక అద్దాలు వాడాలి. ఈ గ్రహణాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ - నాసా లైవ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

సూర్య గ్రహణం రోజు చేయాల్సిన పనులు:

- పురాణాల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో మంత్రాలు జపించాలి. అవి ఏ దైవానివైనా పర్వాలేదు. మంత్రాలు రాకపోతే.కనీసం దేవుళ్ల నామస్మరణ అయినా చెయ్యాలి.

- సూర్యగ్రహణం ప్రారంభానికి ముందే.మీరు తినే ఆహారం, తాగే ద్రవాలకు తులసి ఆకులను జత చేయండి.

- మీ ఇంట్లో పిల్లలు చాలా చిన్నవాళ్లైతే.ఎట్టి పరస్థితుల్లో వారిని సూర్యగ్రహణం సమయంలో ఒంటరిగా వదలకండి.

- మీరు ప్రెగ్నెంట్ అయితే, సూర్యగ్రహణం సమయంలో ఇంట్లోంచీ బయటకు రావద్దు. సూర్యగ్రహణ నీడ ఎట్టి పరిస్థితుల్లో మీ గర్భంపై పడకుండా చూసుకోండి అని పండితులు చెబుతున్నారు.

- మీ ఇంట్లో పూజ గది ఉంటే... దానిపై సూర్యగ్రహణం నీడ పడకుండా ఇంటి డోర్లు, కిటికీలూ మూసివేయండి లేదంటే కర్టెన్లైనా వేసేయండి.

- సూర్యగ్రహణం తర్వాత.మీ ఇంట్లో ఉండే తాగు నీరును మార్చేసి.కొత్తగా మళ్లీ తాగు నీరు తెచ్చుకోండి.

- సూర్యగ్రహణం ముగిశాక తల స్నానం చెయ్యండి. ఒళ్లంతా తడవాలి. పూర్తిగా స్నానం చెయ్యాలి.

- ఏవైనా విరాళాలు, దానాలూ చెయ్యదలిస్తే.వాటిని సూర్యగ్రహణానికి ముందే ఇంట్లోంచీ బయట పెట్టుకోండి. సూర్యగ్రహణం ముగిశాక వాటిని దానం చెయ్యండి.

సూర్య గ్రహణం రోజు చేయకూడని పనులు:

- పండితుల ప్రకారం సూర్యగ్రహణం సమయంలో బయటకు వెళ్లకండి. ముఖ్యంగా విశాలమైన, ఎవరూ లేని ప్రదేశాలకు వెళ్లకండి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో నెగెటివ్ ఎనర్జీ, చెడు శక్తులు అత్యంత బలంగా, ప్రభావవంతంగా ఉంటాయి. అవి ఒంటరిగా ఉన్న వారిని ఆవహిస్తాయి.

- సూర్యగ్రహణం సమయంలో గర్భిణీలు వంటలు వండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో సూది, దారం వాడకూడదు.

- సూర్యగ్రహణం తర్వాత ఏమీ తినకూడదు.

- సూర్యగ్రహణం ప్రారంభమయ్యాక నిద్రపోకూడదు. ఐతే.పిల్లలు, ముసలివారు, అనారోగ్యంతో ఉన్నవారు మాత్రం పడుకోవచ్చు.

- సూర్యగ్రహణం ప్రారంభమయ్యాయక.తులసి ఆకులు తెంపకూడదు. గ్రహణానికి ముందే వాటిని తెంపుకోవాలి.

- సూర్యగ్రహణం సమయంలో దేవతలు, దేవుళ్ల విగ్రహాలు, పటాలను ముట్టుకోకూడదు.

- సూర్యగ్రహణం సమయంలో మాంసం తినకూడదు, మద్యం తాగకూడదు. అలా చేస్తే.అనేక సమస్యలు తప్పవు.

- మామూలు కళ్లతో సూర్యగ్రహణాన్ని చూస్తే.కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :