More ...

Sunday, December 13, 2020

Danger is if you use earphones too muchRead also:

మీరు ఎక్కువగా ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారా? అయితే మీకు డేంజరే. ఇయర్‌ఫోన్స్ అతిగా వాడితే చాలా సమస్యలున్నాయి. అవేంటో, ఎలా తప్పించుకోవాలో తెలుసుకోండి.

1. ఇయర్ ఫోన్లు అతిగా వాడితే జరిగే ప్రమాదాలపై ఎన్ని హెచ్చరికలు చేసినా వాటిని కేర్ చేసేవారు ఒక్కరు కూడా లేరు. చెవి పోటు, ఇన్ఫెక్షన్ల ముప్పుకు కారణమయ్యే ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్ల వాడకాన్ని వీలైనంత అవాయిడ్ చేయండి. ఇవి స్టైల్ సింబల్ యాక్సెసరీస్ గా మారిన నేపథ్యంలో అవసరం ఉన్నా లేకపోయినా వేలకు వేలు పోసి ఇయర్ బడ్స్ కొని, వాటిని గంటల తరబడి చెవులకు తగిలించుకుంటున్నారు. 

2. డ్రైవింగ్ టైంలో కూడా మాట్లాడేందుకు కన్వీనియంట్ గా ఉంటుందని ఇయర్ ఫోన్లు లేదా ఇయర్ బడ్స్ పెట్టుకునే వారు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురై, ప్రాణాలు పోగొట్టుకుంటున్నా మన ప్రవర్తనలో మాత్రం ఏ మార్పూ రావటం లేదు.

3. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం నేపథ్యంలో ఆఫీసు పని చేయాలన్నా, ఆన్ లైన్ క్లాస్ చెప్పాలన్నా, వినాలన్నా ఇయర్ పాడ్స్ సపెట్టుకోవడం తప్పనిసరిగా మారింది. దీంతో చెవి పోటు, చెవి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా పెరిగింది.

4. ముంబైలో 52 ఏళ్ల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇలాగే రోజూ హెడ్ ఫోన్ వాడివాడి చివరికి విపరీతమైన ఇన్ఫెక్షన్ దెబ్బకు ఆసుపత్రి పాలయ్యాడు. 40 రోజుల తరువాతకానీ ఈయనకు నొప్పి తగ్గలేదట.

5. మీకు తెలుసా ఇయర్ ఫోన్, ఇయర్ పీస్, ఇయర్ బడ్, ఎయిర్ ప్యాడ్, బ్లూటూత్ ఆపరేటింగ్ ఇయర్ ఫోన్.. ఇలా పేర్లు ఏవైనా వీటిని కర్ణబేరికి అత్యంత దగ్గరగా చెవిలోనే పెట్టుకోవడం వల్ల చెవిలో ఫంగస్, బ్యాక్టీరియాలు పేరుకుని మీకు దురద, నొప్పి, చెవిలో చీము కారడం, పోటు, చెవిలో జోరీగ వాలుతున్నట్టు గుయ్ మని ఏదో సౌండ్ వచ్చినట్టు మీకు చాలా వివిధ రకాల బాధలు ఎదురవుతాయి.

6. ఇయర్ ఫోన్లు పెట్టుకోవడంతో చెవిలోకి గాలి దూరే అవకాశం తగ్గిపోతుంది, దీంతో చెవిలో ఫంగస్ అతిగా పెరుగుతుంది. మనదేశంలోని ENT వైద్యులు చెబుతున్న విషయమల్లా ఒకటే.. ఈ ఏడాది మార్చ్ నుంచి వివిధ రకాల చెవి రోగాలతో బాధపడుతున్నవారి సంఖ్య 4 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. 

7. ఇయర్ ఫోన్లు వాడటం వల్ల మనం వినికిడి శక్తి కోల్పోతాం. సాధారణంగా వయసు రీత్యా మనం ప్రతిఏటా కొంత మేర వినికిడి శక్తిని సహజంగానే కోల్పోతాం, దీనికి విరుగుడు లేదు. ఇదంతా చాలదన్నట్టు మనం చేతులారా చిన్న వయసులోనే బలవంతంగా వినికిడి కోల్పోయేలా ప్రవర్తిస్తే వైద్యులు చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఇలా వచ్చే చెవుడుకి చెవిటి మిషన్లు కూడా పనిచేయవు.

8. అంతేకాదు తప్పని పరిస్థితుల్లో కొన్ని నిమిషాలపాటు మీరు ఇయర్ బడ్స్ వంటి డివైజెస్ వాడినప్పుడు వాటిని స్పిరిట్ లేదా శానిటైజర్ తో శానిటైజ్ చేయాలి, లేదంటే చెవి బాధలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మీరు హెడ్ ఫోన్స్ వాడటం మొదలుపెట్టి ఎంతకాలమైంది, వాటిని ఎప్పుడైనా క్లీన్ చేసినట్టు గుర్తుందా అన్న ఆత్మ పరిశీలన చేసుకుంటే మీరు ఎంత ప్రమాదాన్ని కొనితెచ్చుకుంటున్నారో మీకే స్పష్టంగా అర్థమవుతుంది.

9. ఫోన్లు, టీవీలు, కంప్యూట‌ర్లు, ట్యాబ్‌లు ఏవైనా స‌రే వాటికి అంతర్గ‌త స్పీక‌ర్లు ఉంటాయి. వాటి ద్వారా వ‌చ్చే సౌండ్ స‌రిపోతుంది. ఇయ‌ర్ ఫోన్లు పెట్టుకుని మ‌రీ వినాల్సిన ప‌నిలేదు. ఇయ‌ర్ ఫోన్లు పెట్టుకోద‌లిస్తే త‌క్కువ సౌండ్‌తో వినాలి.

10. సంగీతాన్ని ఇష్టపడేవారు, ఎక్కువసేపు ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకుని రోజూ గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. అసలు ఇయర్ ఫోన్లోనే మ్యూజిక్ (music) ఎందుకు వినాలి? ఇక ఎక్సర్ సైజ్ లు చేసే సమయంలో ఇయర్ బడ్స్ పెట్టుకునే ఎందుకు చేయాలి? ఏం మ్యూజిక్ చెవిలో లేకుండా మీరు జిమ్ చేయలేరా?

11. మీరు ఇయర్ పీసులు వాడుతుంటే రోజుకు 4 నిమిషాలకు మించి వాడరాదనే వైద్యుల సలహా తూ.చ. పాటించడం చాలా మంచిది. అంతేకాదు మీరు మొహమాటానికి పోయి ఎవరికీ మీ ఇయర్ పీసులు ఇవ్వకండి. ఇలా ఒకిరిది ఒకరు మార్చుకుంటే మీకు ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎవరిది వారు మాత్రమే ఉపయోగించండి. 

12. అసలు ఇయర్ ఫోన్లు వాడేవారి చెవుల్లో బ్యాక్టీరియా 7 రెట్లు ఎక్కువ పెరుగుతుంది. మరి మీరు ఇలా వేరే వారి ఇయర్ బడ్స్ వాడారో అది మీకు కూడా అంటుకుంటుంది. ఇయర్ ఫోన్ల వాడకంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సైతం ఎన్నో సలహాలు, సూచనలు చేసింది. అయినా మనమంతా వీటిని పెడచెవిన పెడుతున్నాం.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :