Thursday, December 24, 2020

SBI SCO Recruitment 2021



Read also:

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 489 ఖాళీలను ప్రకటించింది. వేర్వేరు విభాగాల్లో ఇంజనీర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే అప్లై చేయాలి. ఈ పోస్టులకు డిసెంబర్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 11 చివరి తేదీ. అభ్యర్థులకు ఎగ్జామ్ ఫిబ్రవరిలో ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/ లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

మొత్తం ఖాళీలు- 489

  • స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్-SCO ఫైర్- 16
  • డిప్యూటీ మేనేజర్ (ఇంటర్నల్ ఆడిట్)- 28మేనేజర్ (నెట్వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్)- 12
  • అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 40
  • డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్)- 60
  • అసిస్టెంట్ మేనేజర్ (సిస్టమ్స్)- 183
  • డిప్యూటీ మేనేజర్ (సిస్టమ్స్)- 17
  • ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్- 15
  • ప్రాజెక్ట్ మేనేజర్- 14
  • అప్లికేషన్ ఆర్కిటెక్ట్- 5
  • టెక్నికల్ లీడ్- 2
  • మేనేజర్ (క్రెడిట్ ప్రొసీజర్స్)- 2
  • మేనేజర్ మార్కెటింగ్- 40
  • డిప్యూటీ మేనేజర్ మార్కెటింగ్- 35

దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 22

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 11

కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి 22

రాతపరీక్ష- 2021 ఫిబ్రవరి 1

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

ఎంపిక విధానం- ఆన్‌లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూల్, విజయవాడ, విశాఖపట్నం.

Official Website

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :