Thursday, December 24, 2020

IDBI Bank Jobs



Read also:

IDBI Bank Jobs: ఐడీబీఐ బ్యాంకులో 134 ఉద్యోగాలు నేటి నుంచి దరఖాస్తులు

బ్యాంకు ఉద్యోగం మీ కలా? బ్యాంకులో మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఐడీబీఐ బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 134 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 27 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.idbibank.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

  • మొత్తం ఖాళీలు- 134
  • డీజీఎం (గ్రేడ్ డీ)- 11
  • ఏజీఎం (గ్రేడ్ సీ)- 52
  • మేనేజర్ (గ్రేడ్ బీ)- 62

అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ)- 9 Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో జాబ్స్... దరఖాస్తుకు 3 రోజులే గడువు

దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 24

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 27

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డీజీఎం (గ్రేడ్ డీ) పోస్టుకు 55 శాతం మార్కులతో డిగ్రీ పాస్ కావాలి. ఏజీఎం (గ్రేడ్ సీ), మేనేజర్ (గ్రేడ్ బీ) పోస్టులకు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బీఈ లేదా బీటెక్ పాస్ కావాలి. లేదా ఎంసీఏ పాస్ కావాలి. అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్ ఏ) పోస్టుకు డిగ్రీ పాస్ కావాలి. ఫ్రాడ్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా సైబర్ క్రైమ్‌ లాంటి క్వాలిఫికేషన్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

ఎంపిక విధానం- గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ

దరఖాస్తు ఫీజు- రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150.

  • ముందుగా https://www.idbibank.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Careers ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.
  • Current Openings పైన క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వివరాలు కనిపిస్తాయి.
  • Recruitment of Specialist Cadre Officers FY 2020-21 ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో NEW REGISTRATION పైన క్లిక్ చేయాలి.
  • పేరు, పుట్టిన తేదీ, కాంటాక్ట్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ లాంటి వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత స్టెప్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  • ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసిన తర్వాత విద్యార్హతలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేసి save and next బటన్ పైన క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకోవాలి. తప్పులు ఏవైనా ఉంటే సరిచేయాలి.
  • ఆ తర్వాత save and next పైన క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించిన Final Submit బటన్ పైన క్లిక్ చేయాలి.
  • మీ అప్లికేషన్ ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అవుతుంది.
  • అప్లికేషన్ వివరాలు ఎస్ఎంఎస్, ఇమెయిల్‌లో వస్తాయి.
  • దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భవిష్యత్తులో రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :