Thursday, December 3, 2020

Pure Honey Test



Read also:

Pure Honey Test: స్వచ్ఛమైన తేనెను ఈ మూడు మార్గాల ద్వారా గుర్తించండి..

మార్కెట్ అంతా కల్తీ మయం అయిపోయింది. ఏది స్వచ్ఛమైనదో.ఏది కల్తీనో తెలియడం లేదు. తాజాగా భారత్ లో తయారయ్యే తేనెలో 13 ప్రముఖ బ్రాండ్లు కూడా కల్తీ కి పాల్పడుతున్నాయన్న విషయం సంచలనం సృష్టించింది. సహజ ఔషధ గుణాలున్న తేనె.మనకు ఎంతో అవసరం. స్వచ్ఛమైన తేనె ఎన్నిరోజులైనా పాడవదు. అంతేకాక అందులో ఉండే ఔషధ గుణాలు.. మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. కానీ కల్తీ తేనెలు వాడటం మూలాన అవి త్వరగా పాడవడం అటుంచితే దాని ద్వారా ఆరోగ్యాలు కూడా నాశనం చేసుకుంటున్నాం. ఎంతో నమ్మకమైన బ్రాండ్లుగా పేరున్న డాబర్, పతాంజలి, బైద్యనాథ్ వంటివి కూడా కల్తీకి పాల్పడుతున్న నేపథ్యంలో స్వచ్ఛమైన తేనెను గుర్తించడమెలా

స్వచ్ఛమైన తేనెను గుర్తించడానికి పలు మార్గాలున్నాయి. దీనిని మన ఇంటిలోనే చేసుకోవచ్చు. దీనికోసం మన ఇంట్లో పెద్ద పెద్ద అధునాతన సాంకేతిక పరికరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన పన్లేదు. మన వంటింట్లో లభ్యమయ్యే వాటితోనే తేనెను చెక్ చేసుకోవచ్చు.

వెనిగర్ టెస్ట్ (vinegar test)

తేనె అసలుదో నకిలిదో గుర్తించాలంటే వెనిగర్ ద్వారా ఇట్టే పట్టేయచ్చు. మీ ఇంట్లో మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తేనె డబ్బాలోని రెండు, మూడు చుక్కల తేనెను వెనిగర్ నీటిలో వేయండి. వెనిగర్ వాటర్ లో ఉన్న ఆ తేనె నురుగులు వస్తే మాత్రం అది కచ్చితంగా కలుషితమైనదే.

నీటి పరీక్ష (water test)

తేనె స్వచ్ఛతను గుర్తించడానికి ఇది మరొక పరీక్ష. స్వచ్ఛమైన తేనె నీటిలో కరగదు. దీనికోసం తేనెను.నీటిని కలపండి. నీటిలో కరిగితే మాత్రం అది చక్కెర ద్రావణమే. అసలైన తేనె నీటిలో వేసినా దానికుండే సహజ గుణాలను కోల్పోదు.

వేడి పరీక్ష (heat test)

వేడి నీటి పరీక్ష ద్వారా కూడా తేనె కలుషితమైందో లేదో తెలుసుకోవచ్చు. తేనె డబ్బాలో ఒక అగ్గిపెట్టెను గానీ.దూది ముక్కను గాని వేయండి. అనంతరం దానిని వెలిగించండి. మీరు మంటను చూడగలిగితే అది స్వచ్ఛమైన తేనె. అలా కాకుండా మండీ మండకుండా ఉంటే అది కలిషితమైంది.

E-SR Revised Orders GO 99

టీచర్స్ ట్రాన్సఫర్స్  అన్ని జిల్లాల ప్రోవిషనల్ సీనియారిటీ లిస్ట్ లు

SALARY సర్టిఫికెట్

AP Departmental tests may-2020 Key Response Sheets

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :