Wednesday, December 2, 2020

new post office rules from dec 11



Read also:

New post office rules from Dec 11

పోస్టాఫీస్‌లో అకౌంట్ ఉన్న వారు డిసెంబర్ 11 నుంచి అమలులోకి రానున్న కొన్ని కొత్త రూల్స్ గురించి తెల్సుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్స్ అకౌంట్ కలిగిన వారిపై ప్రతికూల ప్రభావం చూపించనున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు అమలులోకి రానున్నాయి. మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే చార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల కొత్త మినిమమ్ బ్యాలెన్స్ రూల్స్ గురించి తెలుసుకోవాలి. పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారు డిసెంబర్ 11 నుంచి కచ్చితంగా అకౌంట్‌లో రూ.500 కలిగి ఉండాలి.

లేనట్లయితే మెయింటెనెన్స్ చార్జీలు కట్టాల్సి వస్తుంది. పోస్టాఫీస్ ఇప్పటికే సేవింగ్స్ కలిగిన వారికి ఈ విషయాన్ని తెలియజేసింది.

ఒకవేళ అకౌంట్‌లో అసలు డబ్బులు లేకపోతే అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది.పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌పై 4 శాతం వడ్డీ లభిస్తుంది. రూ.10,000 వరకు వడ్డీ మొత్తంపై ఎలాంటి వడ్డీ పడదు. మూడు ఆర్ధిక సంవత్సరాల్లో కనీసం ఒక్కసారైనా లావాదేవీ నిర్వహించి ఉండాలి. అప్పుడే అకౌంట్ క్లోజ్ అవకుండా ఉంటుంది. ఇంకా కస్టమర్లకు ఏటీఎం, చెక్‌బుక్, మొబైల్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :