Sunday, December 6, 2020

increased the disel and petrol costs



Read also:

దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎన్నడూలేనివిధంగా ఇంధనం ధరలు పైపైకి పోతున్నాయి. వరుసగా ఐదో రోజూ ఇండియన్ క్రూడ్ ఆయిల్ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. ఈరోజు లీటర్‌ పెట్రోల్‌పై రూ. 28 పైసలు, డీజిల్‌పై రూ. 29 పైసలు పెరిగాయి. విదేశీ మారకపు రేటు, అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సంస్థలు ఇంధన ధరలను పెంచాయి. పెరిగిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 83.41, లీటర్‌ డీజిల్ ధర రూ.73.61కు చేరింది. ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌ ధర రూ. 90.05, డీజిల్‌ ధర రూ. 89.78కు చేరింది. నవంబర్‌ 20 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :