Sunday, December 6, 2020

transfers in web counseling



Read also:

Transfers in web counseling

వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఉపాధ్యాయుల బదలీలు: మంత్రి పేర్ని నాని మచిలీపట్నం, డిసెంబరు 5ప్రభాతవార్త: మూడేళ్లుగా బదిలీలను నిర్వహించక పోవడంతో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర

ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలను పారదర్శంగా చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి పేర్ని నాని తెలియచేశారు. ఆయన శనివారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, వారు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ నేపధ్యంలో బందరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొంతమంది మహిళలు మంత్రిని కలిసి, తమ గ్రామంలో గత 8 సంవత్సరాలుగా ఒక ఉపాధ్యాయురాలు ఎంతో ఆదర్శవంతంగా విధులు నిర్వ హిస్తూ బాలబాలికలకు ఉత్తమ విద్యా ప్రమాణాలను అందిస్తున్నారని పేర్కొ న్నారు. తమ గ్రామాన్ని ఎంతో చైతన్యపరుస్తున్న అటువంటి ఉపాధ్యా యురాల ను బదిలీ పేరుతో వేరే ప్రాంతానికి పంపించబోతున్నారని, ఆమెను తిరిగి తమగ్రామంలోనే ఉద్యోగం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞపి , చేశారు. దీనిపై స్పందించిన మంత్రి నాని వారితో మాట్లాడుతూ బదిలీలు, ఉద్యోగ విరమ ణలు ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తప్పని అంశమని, ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులందరూ కూడా బదిలీలకు అర్హులని తెలిపారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఈ బదిలీల ప్రక్రి యను నిర్వహించడం జరుగుతుందని, టీచర్లకు స్కూళ్ల ఎంపిక ఆప్షన్ల నమోదు నుండి బదిలీ ఉత్తర్వుల జారీ వరకు పూర్తి ప్రక్రియలను ఆన్లైన్లోనే విద్యా శాఖ నిర్వహించనుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పలు అంశాలను పరిగణ లోకి తీసుకుని ఈ బదిలీల నిర్ణయాలను అధికారులు తీసుకుంటారని వెల్లడించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :