Sunday, December 13, 2020

Important Notes on 10th Class Annual Exam



Read also:

  • ప్రధానోపాధ్యాయులు కు / ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు 10 వ తరగతి వార్షిక పరీక్ష గురించి ముఖ్య ముఖ్య సూచనలు
  • ప్రధానోపాధ్యాయులకు/ ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లకు ముఖ్య ముఖ్య సూచన:-
  • 2020-21 విద్యాసంవత్సరంలో పదోతరగతి చదువుతున్న విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపుకు సంబంధించిన ప్రకటన డిసెంబర్ నెల చివరి వారంలో రావడం జరుగుతుంది. 
  • కనుక మీ మీ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు అనగా విద్యార్థి పేరు ఇంటి పేరుతో సహా, తండ్రి పేరు ఇంటి పేరుతో సహా, తల్లి పేరు ఇంటి పేరుతో సహా, పుట్టిన తేదీ, లింగము, మీడియం, ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజెస్ వివరాలు, పుట్టుమచ్చల వివరాలు వంటివి ఎలాంటి తప్పులు లేకుండా CSE సైట్ నందు నమోదు చేయాలి. 
  • తల్లిదండ్రుల పేర్ల ముందు కూడా వారి ఇంటి పేరు నమోదు చేయాలి. 
  • ఇంటి పేరు తో కలిపి విద్యార్థి/ తండ్రి/ తల్లి పేరు 42 అక్షరాలకు మించి ఉండరాదు.
  • విద్యార్థుల పాస్ పోర్ట్ సైజు ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ లో మాత్రమే తీయించి స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి ఉంచుకోవాలి. 
  • విద్యార్థుల సంతకాలు సేకరించి స్కాన్ చేసి ఉంచుకోవాలి. 
  • తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల వివరాల ధ్రువీకరణ పత్రాల పై సంతకాలు సేకరించాలి. 
  • ఈ విద్యా సంవత్సరం (2020-21) నుండి పదవ తరగతి మార్కు లిస్టు విడుదలైన తర్వాత ఎలాంటి సవరణలు చేయబడవు. 
  • కనుక ప్రధానోపాధ్యాయులు పూర్తి జాగ్రత్తలు తీసుకుని విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి. 
  • నామినల్ రోల్స్ తయారు చేసే సందర్భంలో కూడా విద్యార్థుల మీడియం నమోదు చేయడంలో, సబ్జెక్టుల కాంబినేషన్ నమోదు చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలి. 
  • ఏవైనా పొరపాట్లు జరిగితే సంబంధిత ప్రధానోపాధ్యాయు లు బాధ్యత వహించవలసి ఉంటుంది. 
  • దివ్యాంగ విద్యార్థులు (Disabled) ఉన్నట్లయితే వారి ఒరిజినల్ మెడికల్ సర్టిఫికేట్ సేకరించి ఉంచుకోవాలి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :