Monday, December 28, 2020

if ATM transaction failed charges



Read also:

మీరు ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేప్పుడు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందా? అకౌంట్‌లో డబ్బులు లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఛార్జీలు చెల్లించాలి. ఎంతో తెలుసుకోండి.

1. ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ కావడం సర్వసాధారణమే. సాధారణంగా టెక్నికల్ సమస్యల వల్ల ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతుంటాయి. లేదా అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది. 

2. అకౌంట్‌లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే కస్టమర్లు ఛార్జీలు చెల్లించాలి. ఈ ఛార్జీలు మీ అకౌంట్ ఉన్న బ్యాంకును బట్టి ఉంటాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

3. SBI: బ్లాలెన్స్ లేక ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఎస్‌బీఐ రూ.20+జీఎస్‌టీ వసూలు చేస్తుంది.

4. HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.25+జీఎస్‌టీ వసూలు చేస్తుంది. ఏటీఎం లావాదేవీలతో పాటు మర్చంట్ దగ్గర జరిపే లావాదేవీలకూ ఇది వర్తిస్తుంది.

5. ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ప్రతీ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌కు రూ.25+జీఎస్‌టీ వసూలు చేస్తుంది. ఏటీఎంలతో పాటు పాయింట్ ఆఫ్ సేల్‌కు ఈ ఛార్జీ వర్తిస్తుంది. 

6. Kotak Mahindra Bank: కొటక్ మహీంద్రా బ్యాంక్ కూడా రూ.25+జీఎస్‌టీ ఛార్జీ వసూలు చేస్తుంది. 

7. YES Bank: యెస్‌ బ్యాంక్ ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్‌కు రూ.25+జీఎస్‌టీ ఛార్జ్ చేస్తుంది.

8. Axis Bank: యాక్సిస్ బ్యాంక్ డొమెస్టిక్ ఏటీఎంలల్లో ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్లకు రూ.25+జీఎస్‌టీ వసూలు చేస్తుంది. 

9. మరి ఈ ఛార్జీలు తప్పించుకోవాలంటే ఏం చేయాలన్న సందేహం కస్టమర్లలో ఉంటుంది. అందుకే ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేముందే అకౌంట్‌లో బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం మంచిది.

10. అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో అంతే డ్రా చేయాలి. అంతకన్నా ఎక్కువ ఏటీఎంలో ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :