Monday, December 28, 2020

Dark Days 42



Read also:

42 రోజులుగా సూర్యుడు రావట్లేదు-మొత్తం రాత్రే ఎక్కడ, ఎందుకు ఉట్కియాగ్విక్​ నగర ప్రజలు సూర్యుడిని చూడాలంటే వచ్చే నెల 22వ తేదీ వరకు ఆగాల్సిందే.  

సూర్యుడు లేకుండా మనం ఒక్కరోజును కూడా ఊహించుకోవడం కష్టం. సూర్యరశ్మి లేకుంటే అంతా మబ్బుగా ఉంటుంది. వర్షం పడి వెలుతురు ఉన్నా సూర్యుడు రాకుంటే మళ్లీ ఎప్పుడు దర్శనమిస్తాడా అని చూస్తాం. అలాంటిది అమెరికాలోని ఓ నగరంలో 42 రోజుల క్రితం అస్తమించిన సూర్యుడు.. మళ్లీ ఉదయించలేదు. ఇన్ని రోజులు అక్కడ ఉదయం అన్నదేలేదు. 24 గంటలూ రాత్రే. మొత్తం చీకటే. ఎక్కడ, ఎందుకు ఇలా అంటే..

అమెరికాలోని అలస్కా రాష్ట్రం “ఉట్కియాగ్విక్” నగరంలో ప్రతి ఏడాది రెండు నెలల పాటు(65 రోజులు) రాత్రే ఉంటుంది. ఈ ఏడాది  నవంబర్ 15న చివరిసారిగా అక్కడ సూర్యుడు అస్తమించాడు. దాదాపు 42 రోజులుగా అక్కడి ప్రజలు చీకట్లోనే.. నిత్యం విద్యుత్ దీపాల వెలుగులోనే ఉంటున్నారు. మళ్లీ అక్కడ సూర్యుడు ఉదయించేది వచ్చే ఏడాది జనవరి 22వ తేదీనే. చీకటి ఉండే ఈ సమయాన్ని పొలార్ నైట్ అని పిలుస్తారు.

శీతాకాలం సమయంలో సమయంలో ప్రతి ఏడాది ఉట్కియాగ్విక్​ నగరంలో 65 రోజుల పాటు సూర్యుడు ఉదయించడు. ఏటా నవంబర్ 15 నుంచి 19 మధ్య మాయమయ్యే భానుడు మళ్లీ తర్వాతి ఏడాది 20వ తేదీ తర్వాతే దర్శనమిస్తాడు. ఇలా ఈ ప్రాంత ప్రజలను 60రోజులకు పైగా చోకట్లోనే ఉంచుతాడు.

ఎందుకిలా అవుతోంది

ఉట్కియాగ్విక్.. అలస్కా ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. దీని ఉత్తర, దక్షిణ ధృవాలు భౌగోళికంగా ఆర్కిటిక్​కు చెందినవి. ఇక్కడ భూమి అంశం వంపు తిరిగి ఉండడం కారణంగా ప్రతి ఏడాది పొలార్​ నైట్ ఏర్పడుతోంది. ఈ ప్రాంతంలో 60 రోజులకు రోజుల పాటు సూర్యుడు కనిపించడం లేదు. ఈ వంపు అడ్డం వస్తున్న కారణంగా ఉట్కియాగ్విక్ పై ఈ కాలంలో సూర్యరశ్మి పడడం లేదు. దీనివల్ల చిమ్మచీకటి కాకున్నా.. వెలుతురు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. రాత్రి లాగే ఉంటుంది. మళ్లీ వచ్చే ఏడాది జనవవి 22 వస్తేనే ఇక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో సూర్యుడిని దర్శించుకోగలుగుతారు.  ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత 0 డిగ్రీలుగా నమోదవుతోంది. అలాగే భూమిపై అత్యంత మేఘావృతమైన ప్రాంతంగానూ ఉట్కియాగ్విక్ ఉంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :