Tuesday, December 29, 2020

అమ్మఒడి సాయంలో రూ.వెయ్యి మినహాయింపు



Read also:

  • అమ్మఒడి సాయంలో రూ.వెయ్యి మినహాయింపు
  • తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు రూ.14వేల జమ

అమ్మఒడి పథకం కింద ఇచ్చే రూ.15వేల నుంచి రూ.వెయ్యి మినహాయించి, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి జమ చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సోమవారం జారీచేసిన ఆదేశాల్లో తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థుల తల్లులకు చెల్లించే మొత్తంలో రూ.వెయ్యి తగ్గించి, వాటిని ఆయా విద్యాసంస్థల్లో మరుగుదొడ్ల నిర్వహణకు ఇవ్వనున్నారు. 2019-20 విద్యా సంవత్సరంలో ఈ పథకంలో సహాయం అందుకున్న విద్యార్థులందరూ 2020-21 సంవత్సరానికి అర్హులేనని పేర్కొంది. గతేడాది పదో తరగతి చదివి ఆన్‌లైన్‌ సమస్య కారణంగా ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలు పొందలేకపోయిన విద్యార్థులూ అమ్మ ఒడికి అర్హులేనని.. ఐఐటీ, పాలిటెక్నిక్‌, ట్రిపుల్‌ ఐటీ కోర్సులు ఎంచుకున్న వారికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తున్నందున ఈ పథకం వర్తించదని పేర్కొంది. కొవిడ్‌-19 కారణంగా విద్యార్థులందరికీ 75% హాజరు నిబంధన నుంచి 2020-21 సంవత్సరానికి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. జనవరి 9న అమ్మ ఒడి లబ్ధిని అందించనున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :