Tuesday, December 8, 2020

APSSDC Jobs



Read also:

APSSDC Jobs: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలివే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక మందికి శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్న ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్(VASUDHA PHARMA CHEM LIMITED) కంపెనీలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక మందికి శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తున్న ఏపీ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ తాజాగా మరో ప్రకటన విడుదల చేసింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్(VASUDHA PHARMA CHEM LIMITED) కంపెనీలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందు అర్హులు. కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయస్సు 20-25 ఏళ్లు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12, 500 వేతనంతో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 12లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

APSSDC Jobs

అభ్యర్థుల ఎంపిక ఇలా

అభ్యర్థులు మొదట APSSDC వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా స్కిల్ డవలప్మెంట్ ఆఫీసర్(DSDO) ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నంలోని Vasudha Pharma Chem Limited కార్యాలయంలో శిక్షణ ఉంటుంది. శిక్షణ నెల పాటు ఉంటుంది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన వారికి వసుధ ఫార్మాలో ఉద్యోగం కల్పించబడుతుంది. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజన, వసతిని APSSDC ఆధ్వర్యంలో కల్పించబడుతుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :