Wednesday, November 25, 2020

WhatsApp Payments



Read also:

మీరు వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ ఉపయోగిస్తున్నారా? వాట్సప్ పేమెంట్స్ రిజిస్టర్ చేయడం నుంచి లావాదేవీలు జరపడం వరకు పూర్తి వివరాలు తెలుసుకోండి.

వాట్సప్ పేమెంట్స్.ఇటీవల వాట్సప్ ప్రారంభించిన పేమెంట్ సర్వీస్ ఇది. అసలు వాట్సప్ పేమెంట్ సర్వీస్ అంటే ఏంటీ? వాట్సప్ యూజర్లకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి? డబ్బులు ఎలా పంపాలి? ఇతరుల నుంచి డబ్బులు ఎలా పొందాలి? తెలుసుకోండి.

1. వాట్సప్ పేమెంట్స్ అంటే ఏంటీ?

ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ అందించే గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటిదే వాట్సప్ పేమెంట్స్ కూడా. ఇండియాలో వాట్సప్ పేమెంట్స్ నిర్వహించేందుకు ఇటీవల నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-NPCI అనుమతి ఇచ్చింది.

2. వాట్సప్ పేమెంట్స్ ఎవరి కోసం?

వాట్సప్ పేమెంట్స్ సేవల్ని వాట్సప్ యూజర్లు అందరూ ఉపయోగించుకోవచ్చు. వాట్సప్‌కు భారతదేశంలో 40 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. కానీ మొదటి దశలో కేవలం 2 కోట్ల మంది యూజర్లకు మాత్రమే వాట్సప్ పేమెంట్ సర్వీస్ లభించనుంది.

3. వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ ఎప్పట్లోగా లభిస్తుంది?

వాట్సప్ పేమెంట్స్ ఇప్పటికే ట్రయల్ పద్ధతిలో భారతదేశంలో నడుస్తోంది. రెండు నెలల్లోనే వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ 2 కోట్ల యూజర్లకు లభిస్తుంది.

4. వాట్సప్ పేమెంట్స్‌ యాక్సెస్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది?

వాట్సప్ పేమెంట్స్ మీకు వచ్చిందో లేదో తెలియాలంటే ముందుగా యాప్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోన్‌లో వాట్సప్ యాప్ ఓపెన్ చేసి కుడివైపు పైభాగంలో ఉన్న త్రీ డాట్స్ క్లిక్ చేయండి. అందులో Payments ఆప్షన్ ఉంటే మీకు వాట్సప్ పేమెంట్స్ యాక్సెస్ లభించినట్టే.

5. వాట్సప్ పేమెంట్స్‌కు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

వాట్సప్ యాప్‌లో Payments ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత Add payment method పైన క్లిక్ చేయాలి. వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ ఉపయోగించాలంటే టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాల్సి ఉంటుంది. నియమనిబంధనలు చదివిన తర్వాత Accept and Continue పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే బ్యాంకుల లిస్ట్ నుంచి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకును సెలెక్ట్ చేయాలి. అకౌంట్ నెంబర్‌కు లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్‌‌కు వెరిఫికేషన్ మెసేజ్ వస్తుంది. వెరిఫై చేసిన తర్వాత అకౌంట్ నెంబర్లు కనిపిస్తాయి. అకౌంట్ సెలెక్ట్ చేస్తే అకౌంట్ సెటప్ పూర్తవుతుంది.

6. వాట్సప్ పేమెంట్స్‌లో డబ్బులు ఎలా పంపాలి?

వాట్సప్ పేమెంట్స్ ద్వారా రెండు పద్ధతుల్లో డబ్బులు పంపొచ్చు. మీరు డబ్బులు పంపాలనుకునే వారి ఛాట్ విండో ఓపెన్ చేసిన తర్వాత అటాచ్‌మెంట్ పైన క్లిక్ చేయాలి. అందులో Payment ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సెండ్ మనీ పైన క్లిక్ చేసి అమౌంట్ టైప్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు ట్రాన్స్‌ఫర్ అవుతాయి.

7. వాట్సప్ పేమెంట్స్‌లో డబ్బులు పంపడానికి రెండో పద్ధతి ఏంటీ?

రెండో పద్ధతి ద్వారా డబ్బులు పంపాలనుకుంటే వాట్సప్ ఓపెన్ చేసి రైట్ టాప్‌లో త్రీ డాట్స్ పైన క్లిక్ చేయాలి. అందులో Payments ఆప్షన్‌లో న్యూ పేమెంట్ పైన క్లిక్ చేసి మీ కాంటాక్ట్స్ లిస్ట్‌లో పేరు సెలెక్ట్ చేయాలి. ముందు చెప్పిన ప్రాసెస్‌లోనే డబ్బులు పంపాలి. అయితే అవతలివాళ్లు కూడా వాట్సప్ పేమెంట్స్ సెటప్ చేసుకుంటేనే డబ్బులు పంపడానికి వీలవుతుంది.

8. వాట్సప్ పేమెంట్స్‌ ద్వారా అందరికీ డబ్బులు పంపొచ్చా?

వాట్సప్ పేమెంట్స్‌ ద్వారా అందరికీ డబ్బులు పంపడం సాధ్యం కాదు. అవతలివాళ్లు అంటే మీరు డబ్బులు పంపాలనుకుంటున్నవాళ్లు కూడా వాట్సప్ పేమెంట్స్ సెటప్ చేసుకుంటేనే డబ్బులు పంపడానికి వీలవుతుంది.

9. ఏ బ్యాంకులో అకౌంట్ ఉన్నా వాట్సప్ పేమెంట్స్ ఉపయోగించొచ్చా?

అకౌంట్ యాడ్ చేసేప్పుడు కనిపించే లిస్ట్‌లో ఉన్న బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉంటే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ప్రధాన బ్యాంకుల్ని వాట్సప్ యూపీఐ సపోర్ట్ చేస్తుంది.

10. వాట్సప్ పేమెంట్స్‌లో ఏవైనా సమస్యలు ఉంటే ఎవరిని సంప్రదించాలి?

వాట్సప్ పేమెంట్స్‌పై యూజర్ల సందేహాలు తీర్చేందుకు, సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఓ ఫోన్ నెంబర్ కేటాయించింది వాట్సప్. యూజర్లు 1800-212-8552 నెంబర్‌కు ఉదయం 8 గంటల నుంచి 6 గంటల మధ్య కాల్ చేయొచ్చు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :