Wednesday, November 25, 2020

సడెన్‌గా బీపీ డౌన్ అయితే ఏం చేయాలి



Read also:

మనలో అధిక శాతం మంది హైబీపీ సమస్యతో బాధపడుతుంటారు. అయితే నిజానికి కొందరికి లోబీపీ సమస్య కూడా ఉంటుంది. అలాంటి వారు లోబీపీతో ఒక్కోసారి స్పృహ తప్పి పడిపోతుంటారు. లేదా అలా స్పృహ తప్పినట్లు అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి ? సడెన్ గా బీపీ డౌన్ అయితే వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? అంటే ఎవరైనా ఒక వ్యక్తి బీపీ డౌన్ అయితే అతనికి తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ముఖం వణికినట్లు ఉంటుంది. చేతులు, కాళ్లు కూడా వణుకుతుంటాయి. బీపీ డౌన్ అయ్యేందుకు కూడా అనేక కారణాలు ఉంటాయి. అయితే బీపీ డౌన్ అవ్వగానే ఎలక్ట్రోలైట్ ద్రావణం లేదా చక్కెర, ఉప్పు కలిపిన నీళ్లు లేదా నిమ్మరసం ఇవ్వాలి.

ఇవేవీ అందుబాటులో లేవని అనుకుంటే కాఫీ తాగించాలి. దీంతో పరిస్థితి కొంత మెరుగు పడేందుకు అవకాశం ఉంటుంది. అలాగే స్వీట్లను కూడా తినిపించవచ్చు.

లోబీపీ సమస్యకు సరైన డైట్‌ను పాటించడమే ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను సమయానికి తీసుకోవాలి. ముఖ్యంగా ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. అరటిపండ్లు, నట్స్‌, బొప్పాయి, ముల్లంగి, పాలకూర వంటివి తినాలి. అలాగే నిత్యం వాకింగ్ లేదా వ్యాయామం చేయాలి. యోగా, మెడిటేషన్ కూడా చేయవచ్చు. దీంతో శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. బీపీ నియంత్రణలోకి వస్తుంది.

AP Teachers Updated School Roll & Teachers list School Wise

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :