Thursday, November 12, 2020

Today teachers news highlights12-11-20



Read also:

కొంపముంచిన వెబ్‌సైట్‌

  • 3 వేల మంది విద్యార్థుల వివరాలు గల్లంతు
  • చైల్డ్‌ఇన్‌ఫో డేటాలో గందరగోళం
  • సుమారు 100 టీచర్‌ పోస్టులపై ప్రభావం
  • ఆందోళన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు

పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌ టీచర్‌ పోస్టులను మింగేసింది. డేటాలో చోటుచేసుకున్న తప్పిదం అనేక పాఠశాలల కొంపముంచింది. జిల్లాలో ఉపాధ్యాయుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ కార్యాలయం నుంచి జిల్లాకు వచ్చిన యూడైస్‌ చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో గందరగోళం నెలకొంది. వివరాల నమోదులో చోటుచేసుకున్న తప్పుల కారణంగా జిల్లాలో 3వేల మంది విద్యార్థుల పేర్లు మాయమయ్యాయి. ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి వరకూ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 3వేలు తక్కువగా చూపించడంతో దాని ప్రభావం ఆయా పాఠశాలలకు కేటాయించే పోస్టులపై పడింది. చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో దొర్లిన తప్పులతో సుమారు 100

స్కూలు అసిస్టెంట్‌ పోస్టులకు కోత పడింది

టీచర్ల పునర్విభజనకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ కార్యాలయం నుంచి డీఈవో కార్యాలయానికి అందిన చైల్డ్‌ ఇన్‌ఫో డేటా తప్పులు తడకగా ఉంది. ఆన్‌లైన్‌లో యూడైస్‌ చైల్డ్‌ ఇన్‌ఫో డేటాను గతంలో ఏపీ ఆన్‌లైన్‌ వారు నిర్వహించే వారు. ప్రస్తుతం ఏపీ ఆన్‌లైన్‌ వదిలేసి రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ కార్యాలయం ఐటీ సెల్‌ దీనికోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. పాఠశాలల్లో చేరిన విద్యార్థుల డేటాను ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. గతంలో ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా చైల్డ్‌ ఇన్‌ఫో డేటాను నిర్వహించినప్పుడు విద్యార్థులు ఎంపిక చేసుకున్న మీడియంలో ఏ పొరపాట్లు వచ్చేవి కావు. అయితే ఏపీసీఎప్‌ఎస్‌ఎస్‌ వెబ్‌సైట్‌లో మాత్రం విద్యార్థుల మీడి యంలో గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తెలు గు, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ మీడియంలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అద నంగా తమిళ మీడియంలో, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో ఒరి యా మీడియం కూడా ఉండేది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అక్టోబరు 31వ తేదీ వరకు విద్యార్థి ఏ మీడియంలో చేరినా తెలుగు మీడియంలో చేరినట్లు ఆన్‌లైన్‌లో నమోదైంది. దీంతో తీవ్ర నష్టం జరిగింది.  తెలుగులో నమోదైన ఇంగ్లీషు మీడియం విద్యార్థులను దానిలోకి మార్చుకొనేందుకు ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వలేదు. దీంతో ఇంగ్లీషు మీడియం విద్యార్థులను కూడా తెలు గు మీడియం విద్యార్థులుగా పరిగణించడంతో హైస్కూళ్లలో స్కూలు అసిస్టెంట్లకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈనెల 1 నుంచి లోపాన్ని ససవరించడంతో ఏ మీడియంలో చేరిన వారిని దానిలోనే చూపి స్తోంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 

3వేల మంది విద్యార్థుల పేర్లు గల్లంతు

టీచర్ల పునర్విభజనకు రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టర్‌ కార్యా లయం ఐటీసెల్‌ జిల్లాకు పంపిన  చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో ప్రస్తుతం ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో 3వేల మంది పేర్లు మాయమైనట్లు ఆయా పాఠశాలల హెచ్‌ ఎంలు అంచనా వేస్తున్నారు  ప్రభుత్వం ప్రకటించిన ప్రకా రం  ఈఏడాది ఏతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండా ఆయా తరగతుల్లో అందరినీ ఉత్తీర్ణులను చేశారు. ఆ ప్రకా రమే హైస్కూళ్లలో విద్యార్థులు అందరినీ గతేడాది వారు చదివిన తరగతి నుంచి పైతరగతి ప్రమోట్‌ చేసి హాజరు పట్టీల్లో పేర్లు రాశారు. అదేవిధంగా ఆన్‌లైన్‌లో కూడా ఆయా విద్యార్థులు పైతరగతికి ప్రమోట్‌ అయినట్లుగా వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ కావాలి. అయితే కొన్ని పాఠశాలల్లో సాంకేతిక కారణాలతో విద్యార్థులు పైతరగతికి ప్రమోట్‌ అయినట్లుగా చూపించలేదు. రాష్ట్ర ఐటీసెల్‌ నుంచి డీఈఓ కార్యాలయానికి వచ్చిన చైల్డ్‌ఇన్‌ఫో డేటాలో కొందరి పేర్లు ఎదురుగా డ్యాష్‌(-) ఉంది. మామూలుగా విద్యార్థులు పేర్లు ఎదురుగా మూడు కాలమ్స్‌ ఉంటాయి. యాక్టివ్‌, డ్రాప్‌అవుట్‌, టీసీ ఇష్యూడ్‌ అని వస్తాయి. అంటే డేటాలో యాక్టివ్‌ ఉన్న విద్యార్థులు మాత్రమే ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్నట్లు డ్రాప్‌అవుట్‌, టీసీ ఇష్యూడ్‌ నమోదైతే వారు పాఠశాలలో లేనట్లు లెక్క. చైల్డ్‌ ఇన్‌ఫో డేటాలో డ్యాష్‌ పెట్టిన వారి విషయమేమిటని ఇక్కడి డీఈఓ అధికారులు ఐటీసెల్‌ను సంప్ర దించగా వారినందరిని డ్రాప్‌ అవుట్‌గా చూపించారు. దీంతో హైస్కూళ్ల పోస్టు లకు భారీగా కోతపడింది. 

100 ఉపాధ్యాయ పోస్టులకు కోత

రాష్ట్ర ఐటీసెల్‌ నిర్వాకం వల్ల జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సుమారు 100 స్కూలు అసిస్టెంట్ల పోస్టులకు కోత పడింది. విద్యార్థులు ఈ ఏడాది జనవరిలో ఆయా పాఠశాలల్లో చదువుతూ అమ్మఒడి పథకం ద్వారా లబ్ధిపొందారు. ప్రస్తుతం కూడా ఆయా పాఠశాలల్లోనే కొనసాగుతున్నారు. అయితే డేటాలో వారి పేర్లు మా యం కావడంతో టీచర్‌ పోస్టులకు కోతపడింది. ఉదాహరణకు టంగుటూరు మండ లంలోని ఓ జడ్పీ హైస్కూలులో ఇంగ్లీషు, తెలుగు మీడియంలో 114మంది పిల్లలు చదువుతున్నారు. అయితే చైల్డ్‌ ఇన్‌ఫోలో 103 మంది మాత్రమే చదువుతున్నట్లు చూపించారు. వాస్తవానికి ఈ పాఠశాలల్లో ఇంగ్లీషు, తెలుగు మీడియంలో 50మందికిపైగా విద్యార్థులు ఉండగా 49మంది ఉన్నట్లు చూపించడంతో ఒక పోస్టుకు కోతపడింది. మద్దిపాడు మండలంలోని ఒక హైస్కూలో తెలుగు మీడియంలో వాస్తవానికి కేవలం 36మం ది మాత్రమే ఉన్నారు. అయితే ఇంగ్లీష్‌ మీడియంలో చేరిన 33 మందిని కూడా చైల్డ్‌ ఇన్‌ఫోలో తెలుగు మీడియంగా చూపడంతో అక్కడ అవసరం లేకపోయినా ఒక పోస్టును కొనసాగించారు. కందుకూరు జడ్పీ బాలికలు హైస్కూల్‌లో నాలుగు పోస్టులకు, పేర్నమిట్ట జడ్పీ హైస్కూలులో రెండు పోస్టులు, యద్దనపూడి మండలం గన్నవరం జడ్పీ హైస్కూలులో రెండు పోస్టులు, చీమకుర్తి మండలం బండ్లమూడి జడ్పీహైస్కూలులో ఒక పోస్టుకు కోత పడింది. వాస్తవానికి కొన్ని జడ్పీ హైస్కూళ్లకు అదనంగా రావాల్సిన పోస్టులు రావాల్సి ఉండగా డేటా తప్పులతో ఆ పోస్టులు రాకుండా పోయాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :