Tuesday, November 3, 2020

Today News highlights



Read also:

  • బడి మొదలైంది-లాక్‌డౌన్‌ తర్వాత పునఃప్రారంభం
  • హాజరు 50శాతం లోపే
  • కరోనా పరీక్షల ఫలితాలను సమర్పించిన ఉపాధ్యాయులు
  • మధ్యాహ్న భోజనానికి ఇంటి నుంచే ప్లేట్లు, తాగునీరు

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత పూర్తి స్థాయిలో పునఃప్రారంభమైన పాఠశాలలకు మొదటి రోజు విద్యార్థుల హాజరు 50 శాతంలోపే ఉంది. చాలా పాఠశాలల్లో 40-45 శాతం మంది విద్యార్థులే వచ్చారు. విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న బడుల్లో సోమవారం ఒక్క పదోతరగతి వారికే తరగతులు నిర్వహించగా.. పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న చోట 9, 10 తరగతుల విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి వారికి ప్రతి రోజూ బోధన కొనసాగనుండగా.. తొమ్మిదో తరగతికి రోజు విడిచి రోజు పాఠశాల ఉంటుంది. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలంలోని వెలగలేరు పాఠశాలలో 85 మంది పదో తరగతి వారు ఉండగా.. మొదటి రోజు 39 మంది మాత్రమే హాజరయ్యారు. విజయవాడ సమీపంలోని నిడమానూరు బడిలో పదో తరగతి విద్యార్థులే 303 మంది ఉండడంతో తరగతి గదుల కొరత కారణంగా ఒక్క తరగతి వారినే అనుమతించారు. తరగతి గదికి 16 మంది చొప్పున విద్యార్థులను కూర్చోబెట్టారు. కొన్నిచోట్ల ఆరుబయట వరండాల్లోనూ తరగతులు నిర్వహించారు. పట్టణాలు, నగరాల్లోని పురపాలక పాఠశాలల్లోనూ విద్యార్థుల హాజరు సగంలోపే ఉంది.

గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో పిల్లల్ని బడులకు పంపించేందుకు తల్లిదండ్రులు కొంత జంకుతున్నారు. కంటెయిన్‌మెంట్‌ జోన్‌లు ఉన్న చోట నుంచి విద్యార్థులు బయటకు రాకుండా ఆంక్షలు ఉన్నాయి. పాఠశాలలకు వస్తున్న వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారిని తరగతులకు రావొద్దని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.

చాలామంది ఉపాధ్యాయులు సోమవారం ప్రధానోపాధ్యాయులకు తమ కరోనా పరీక్షల రిపోర్టులను అందించారు. ప్రాథమిక పాఠశాలల వారు మండల విద్యాధికారులకు సమర్పిస్తున్నారు.

మధ్యాహ్న భోజన వడ్డింపులో సమస్యలు ఎదురవుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. విద్యార్థులను దూర..దూరంగా కూర్చోబెట్టడం, వారు మాట్లాడుకోకుండా చూడడం కష్టంగా మారుతోందని వెల్లడిస్తున్నారు. భోజనానికి అవసరమయ్యే ప్లేట్లు, తాగునీటి సీసాలను విద్యార్థులు ఇంటి నుంచే తెచ్చుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు.

టీచర్లందరూ పాఠశాలలకు హాజరుకావాలి

ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాలలకు హాజరు కావాల్సి దేనని పాఠశాల విద్య డైరెక్టర్ వి.చినవీరభద్రుడు ఆదేశిం చారు. ప్రతిరోజు ఉపాధ్యాయులు శానిటైజర్ ఉపయో గిస్తూ బయోమెట్రిక్ హాజరు నమోదుచేయాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో తగినన్ని గదులు, వసతి సౌకర్యాలు ఉంటే 9వ తరగతి విద్యార్థులు కూడా ప్రతిరోజు పాఠశాలలకు హాజరు కావాలని సూచించారు.

స్టాండర్డ్ కో ఆపరేటివ్ ప్రొసీజర్ ను పాఠశాలల్లో తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. హైస్కూళ్ళలో ఉపాద్యాయులు తక్కువగా ఉండి బోధనకు ఇబ్బంది కలుగుతుంటే ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి హైస్కూళ్లకు డిప్యుటేషన్ వేయాలని డైరెక్టర్ చినవీరభద్రుడు ఆదేశించారు.

ఉపాధ్యాయ బదిలీల కొత్త షెడ్యూలు

  • 41 రోజులపాటు హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ
  • వెబ్‌సైట్‌లో బదిలీ ఉత్తర్వులు: డిసెంబరు 14

ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నందున హేతుబద్ధీకరణను వాయిదా వేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం కొత్త షెడ్యూలును విడుదల చేసింది. మంగళవారం వరకు ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్ధీకరణ చేపడతారు. వెబ్‌ ఆధారిత బదిలీలు నిర్వహిస్తారు.

  • ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నవంబరు 4 నుంచి 9 వరకు
  • ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఖాళీల ప్రకటన 10, 11
  • బదిలీలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ 12 నుంచి 16వ తేదీ వరకు
  • దరఖాస్తుల పరిశీలన 17, 18 తేదీల్లో
  • పాఠశాల, సర్వీసు పాయింట్ల ఆధారంగా ప్రాథమిక సీనియారిటీ జాబితా 19-23
  • సీనియారిటీ జాబితాలపై అభ్యంతరాల స్వీకరణ 24-26
  • అభ్యంతరాల పరిష్కారం 27-29
  • తుది సీనియారిటీ జాబితా  నవంబరు 30 - డిసెంబరు 2
  • పాఠశాలల ఎంపికకు వెబ్‌ ఐచ్ఛికాలు 3-5
  • పాఠశాల కేటాయింపు జాబితా విడుదల 6-11
  • ఏదైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే తుది కేటాయింపు జాబితా 12-13

ఇంటర్‌ ఆన్‌లైన్‌ ప్రవేశాలు 10 వరకు నిలుపుదల

హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

రాష్ట్రంలో జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మీడియేట్‌ విద్యార్థుల ఆన్‌లైన్‌ ప్రవేశాల ప్రక్రియను ఈనెల 10 వరకు నిలుపుదల చేస్తూ సోమవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. కౌంటర్లు దాఖలు చేయాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటర్‌ బోర్ట్‌ తదితరులకు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణ ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జూనియర్‌ ఇంటర్‌లో ఆన్‌లైన్‌ విధానం ద్వారా ప్రవేశాలు కల్పించేందుకు చట్టం అనుమతించనప్పటికీ అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ సెంట్రల్‌ ఆంధ్ర జూనియర్‌ కళాశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు కొల్లి బ్రహ్మయ్య మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు.

పేరెంట్స్ అంగీకార పత్రం తప్పనిసరి : ఆర్ ఐవో

జిల్లాలోని అన్ని కళాశాలల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రాంతీయ పర్యవేక్షణాధికారి బి.ప్రభాకరరావు ఆదేశించారు. నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వీతీయ సంవత్సరం తరగతుల నిర్వహణ తీరు, కొవిడ్ జాగ్రత్తలు అమలుపై సోమవారం తనిఖీలు చేశారు. ఆర్ ఐవో మాట్లాడుతూ విద్యార్థులకు కళాశాల ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ హ్యేండ్ శానిటైజేషన్ విధిగా చేయాలన్నారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తరగతికి కేవలం 16 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా గదులు కేటాయించాలన్నారు. కళాశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ప్రకారం వంద మంది కంటే తక్కువ విద్యా ర్థులు ఉన్న కళాశాలలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వర కూ పని చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్య 101 నుంచి 500 వరకూ ఉంటే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సైన్సు తరగతులు, మధ్యా హ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఆర్ట్స్ గ్రూపుల తరగతులు నిర్వహించాలన్నారు. 500 మంది విద్యార్థుల కంటే ఎక్కువ ఉంటే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సైన్సు, 1 గంట నుంచి 6 గంటల వరకూ ఆర్ట్స్ తరగతులను రోజు విడిచి రోజు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థులను కళాశాల నుంచి బయటికి పంపించేటప్పుడు అందరినీ ఒకేసారి కాకుండా 10 నుంచి 15 నిముషాల వ్యవధిలో విడిచిపెట్టాలన్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :