Tuesday, November 3, 2020

Biometric attendance is mandatory for teachers



Read also:

Biometric attendance is mandatory for teachers

ఉపాధ్యాయులు అందరూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా వేయాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి ఉపాధ్యాయుడు కొవిడ్ - 19 నిబంధనలు పాటిస్తూ శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుని బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని విద్యాధికారులు కోరారు. జిల్లాలోని హైస్కూళ్ళల్లో మొత్తం 5300 మంది స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎక్కడైనా హైస్కూళ్ళల్లో టీచర్ల కొరత ఉంటే ఎంఈవోను సంప్రదించి సమీప ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై తీసుకుని బోధన కొనసాగించాలని సూచించారు. దీంతో పాటు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులందరూ ప్రతి రోజు విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ స్కూలులో 50 శాతం మంది టీచర్లు మాత్రమే విధులకు హాజరవుతున్న విషయం విధితమే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :