Monday, November 16, 2020

PVC Aadhar card download now

Read also:

ఆధార్ ప్రాధికార సంస్థ యూఐడీఏఐ గత నెలలో పీవీసీ ఆధార్ కార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది చూడ్డానికి క్రెడిట్, డెబిట్, పాన్‌కార్డులా ఉంటుంది. ఎంచక్కా వాలెట్‌లో పెట్టుకోవచ్చు. ఈ కొత్త పీవీసీ కార్డులో యూఐడీఏఐ బోల్డన్ని సెక్యూరిటీ ఫీచర్లు జోడించింది. అంతేకాదు, ఇది ఎంతోకాలం మన్నుతుంది కూడా. దేశంలోని ఎవరైనా కేవలం 50 రూపాయల నామమాత్రపు ఫీజు చెల్లించి వీటిని పొందవచ్చు. ఆధార్‌లో తమ ఫోన్ నంబరు లేనివారు నాన్-రిజిస్టర్డ్, లేదంటే ప్రత్యామ్నాయ ఫోన్ నంబరు ఆప్షన్‌పై క్లిక్ చేసి పీవీసీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాదు, తన మొబైల్ నంబరు ఉపయోగించి ఇంటి సభ్యులందరి కోసం ఒక్కరే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది.

ఈ మేరకు ఆధార్ ప్రాధికార సంస్థ ట్వీట్ చేసింది.

పీవీసీ ఆధార్ కార్డు కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి

* తొలుత https://residentpvc.uidai.gov.in/order-pvcreprint లోకి వెళ్లాలి

* ఆధార్ నంబరు/వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబర్, లేదంటే ఆధార్ కార్డుపై ఉన్న ఈఐడీ నంబరు ఎంటర్ చేయాలి

* ఆ తర్వాత 'సెండ్ ఓటీపీ' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మొబైల్ నంబరు రిజిస్టర్ చేసుకోకుంటే ప్రత్యామ్నాయ మొబైల్ నంబరు ఇవ్వొచ్చు.

* మొబైల్ నంబరు రిజిస్టర్ అయి ఉంటే మాత్రం ఆధార్ ప్రివ్యూ కనిపిస్తుంది. లేని వారికి కార్డు ప్రివ్యూ కనిపించదు.

* మొబైల్ ఆధార్ అప్లికేషన్ కోసం టైమ్ బేస్‌డ్ టైమ్ పాస్‌వర్డ్ (టీఓటీపీ)ని కూడా ఉపయోగించుకోవచ్చు.

* ఓటీపీని ఎంటర్ చేశాక, పీవీసీ కార్డు కోసం అవసరమైన రుసుము చెల్లిస్తే పీవీసీ కార్డు కోసం దరఖాస్తు పూర్తయినట్టే.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :